Whatsapp లో సందేశాన్ని మీరు పంపించకూడదని భావిస్తున్నవారికి పొరపాటున పంపేశామని ఆలోచిస్తున్నట్లయితే ఇప్పుడు మీ కోసం వాట్సాప్ సులభం చేసింది. "డిలీట్ ఫర్ ఎవ్రీ వన్ "ఫీచర్ పై కొంతకాలంగా పనిజరుగుతుంది మరియు ఇది Android మరియు iOS వినియోగదారుల కోసం ప్రారంభమవుతుంది. అయితే, ఈ స్టోరీ వ్రాస్తున్నప్పుడు ఈ ఫీచర్ తనిఖీ చేస్తున్నప్పుడు ఈ ఫీచర్ Android స్మార్ట్ఫోన్లో అప్డేట్ అవ్వలేదు , అయితే iOS డివైస్ లో అప్డేట్ అయ్యింది .'డిలీట్ ఫర్ ఎవ్రీ వన్ ' ఫీచర్ ఉపయోగించి, మెసేజ్ పంపినవారు మరియు రిసీవర్ సైడ్ ఇరువైపుల నుండి మెసేజెస్ తొలగించబడతాయి. Whatsapp 'డిలీట్ ఫర్ ఎవ్రీ వన్' ఫీచర్ ఉపయోగించి మీరు గ్రూప్ మరియు వ్యక్తిగతంగా పంపబడిన మెసేజెస్ కూడా డిలీట్ చేయొచ్చు .మీరు పొరపాటున వేరొకరికి ఒక మెసేజ్ ని పంపుతున్నప్పుడు ఈ ఫీచర్ మీకు ఉపయోగకరంగా ఉంటుంది మీరు తొలగించిన మెసేజ్ తొలగించబడిందని మీకు అక్కడ మెన్షన్ అవుతుంది .