888 రూ లకు అనే స్మార్ట్ ఫోన్ రిలీజ్ అయ్యింది ఇండియాలో

888 రూ లకు అనే స్మార్ట్ ఫోన్ రిలీజ్ అయ్యింది ఇండియాలో

888 రూ లకు Docoss అనే కంపెని నుండి Docoss X1 అనే స్మార్ట్ ఫోన్ అనౌన్స్ అయ్యింది ఇండియాలో. రెండు నెలల క్రింత వెబ్ సైట్ రిజిస్టర్ అయిన ఈ కంపెని బుకింగ్స్ వెబ్ సైట్ ద్వారా అందిస్తుంది.

ఆల్రెడీ యూట్యూబ్ లో ఈ ఫోన్ ను unboxing చేస్తున్నట్లు ఒక వీడియో కనిపిస్తుంది. అయితే ఇది కంపెని వ్యక్తులే చేసిన వీడియో అయుంటుంది అని అంచనా.

స్పెక్స్ విషయానికి వస్తే.. దీనిలో 4 in IPS డిస్ప్లే, 1.2GHz డ్యూయల్ కోర్ ప్రొసెసర్, 1GB ర్యామ్ ఉంది. 4GB స్టోరేజ్, 32GB SD కార్డ్ సపోర్ట్.

2MP రేర్ అండ్ 0.3MP ఫ్రంట్ కేమేరాస్, 1300mah బ్యాటరీ, ఆండ్రాయిడ్ కిట్ క్యాట్ os ఉన్నాయి. ఏప్రిల్ 27 నుండి 29 వరకు బుకింగ్స్ ఉంటాయి.

క్యాష్ ఆన్ డెలివరీ కూడా ఉంది. హాండ్ సెట్స్ May 2 నుండి షిప్ కానున్నాయి. అయితే  ఇది కూడా ఫ్రీడం 251 లాంటి controversial కంపెని అనే సందేహం వస్తుంది..

www.docoss.com అనే వెబ్ సైట్ లోకి వెళ్లి బుక్ చేయగలరు కాని మేము ఇంతకుముందు బుకింగ్ ట్రై చేస్తే ఎర్రర్ వచ్చింది. ఇదే విషయాన్ని కంపెని సోషల్ మీడియాలో కూడా ఒప్పుకొని..

7666204430 నంబర్ కు పేరు, అడ్రెస్ మరియు పిన్ కోడ్ డిటేల్స్ పంపి కూడా బుక్ చేసుకోగలరు అని చెబుతుంది. క్రింద ఉన్న unboxing విడియో ను చూడండి..

Shrey Pacheco

Shrey Pacheco

Writer, gamer, and hater of public transport. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo