మీకు తెలుసా ..? Xiaomi యొక్క ఉప బ్రాండ్ POCO F1 మొదటి అమ్మకాలలో కేవలం 5 నిమిషాల్లో 200 కోట్ల రూపాయల విలువగల విక్రయాలను సాధించింది

Updated on 31-Aug-2018
HIGHLIGHTS

మొదటి ఫ్లాష్ మొదలైన 5 నిముషాల్లోనే 200 కోట్ల విలువైన అమ్మకాల మార్కుని దాటినట్లు కంపెనీ తెలిపింది . తదుపరి అమ్మకాలు సెప్టెంబర్ 5 న జరుగుతాయని POCO F1 ప్రకటించింది.

షియోమీ ఉపబ్రాండ్ అయిన పోకో ఫోన్ ఎఫ్ 1 ఫ్లాష్ సేల్ మొదలు పెట్టిన 5 నిముషాల్లోనే 200 కోట్ల కంటే ఎక్కువ విలువైన అమ్మకాలని సాధించిందని కంపెనీ ప్రకటించింది. షియోమి యొక్క గ్లోబల్ VP మరియు మేనేజింగ్ డైరెక్టర్ అయిన మను కుమార్ జైన్ ప్రకారంగా, ఇది ఫ్లిప్ కార్ట్ లోఇప్పటివరకు జరిగిన అతిపెద్ద  ఫ్లాగ్ షిప్ ఫోన్ అమ్మకమని తెలుస్తుంది. బడ్జెట్ ఫ్లాగ్ షిప్ ఫోన్ గా షియోమీ చేత ప్రవేశపెట్టబడిన ఈ ఫోన్ సేల్ మొదలైన కొన్ని నిముషాల్లోనే అవుట్ ఆఫ్ స్టాక్ అయింది, అయితే దీని మరొక సేల్ సెప్టెంబరు 5 న జరగనున్నది.

గత వారం, Xiaomi యొక్క కొత్త POCO F1 స్మార్ట్ఫోన్ వివిధ వేరియంట్లతో భారతదేశం లో విడుదల అయ్యింది అవి :

6GB RAM మరియు 64GB స్టోరేజి – రూ 20,999

6GB RAM మరియు 128GB స్టోరేజి – రూ 23,999

8GB RAM మరియు 256GB స్టోరేజి – రూ 28,999 ధర. సాయుధ వేరియంట్  కూడా అందుబాటులో ఉంది.

పోకోఎఫ్1 స్పెసిఫికేషన్స్

ఈ పోకో ఎఫ్1 క్వాల్కమ్ 845 ఆక్టా కోర్ ప్రాసెస్ శక్తితో పనిచేస్తుంది.  ఇందులో కాపర్ పైపు ద్వారా ఒక లిక్విడ్ కూల్ టెక్నాలజీ అందించబడింది దీనితో వినియోగదారులు అత్యధికంగా ఫోన్ ని వాడే సమయాలలో కూడా CPU ని చల్లగా ఉండే విధంగా చూస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ 19:9 రిజల్యూషన్ గల ఒక 6.18 – అంగుళాల ఫుల్ హెచ్ డి+ IPS LCD డిస్ప్లే ని కలిగివుంది. గొరిల్లా గ్లాస్ తో సురక్షితం చేయబడిన వైడ్ నోచ్ డిస్ప్లే దీనికి అందించారు, ఎందుకంటె ఇందులో  IR లెన్స్ తో చీకటిలో కూడా పేస్ అన్లాక్ ని అందించే విధంగా ఇచ్చారు. ఈ నోచ్ లైటింగ్ సెన్సార్, ఇయర్ పీస్,ఒక 20ఎంపీ సెన్సర్ని ఆఇందులో ఇనుమడించుకొని ఉంది. ఇరుప్రక్కల వున్న బెజెల్స్ సామాన్యంగా ఉన్నాయి మరియు దీని క్రింది భాగం లో ఒక మందపాటి చిన్ ని ఇచ్చారు. కంపెనీ ఇందులో గ్లాస్ బ్యాక్ కాకుండా లేయర్ కలర్ ప్రాసెస్ చేసి మందంగా కోట్ చేయబడిన పోలీకార్బోనేట్ యూనిబాడీని అందించారు. ఈ విధానం వలన ఫోన్ చేతిలో చక్కని గ్రిప్ తో ఇమిడి పోతుంది.

 ముందు చెప్పినట్లుగా, పోకో ఎఫ్1 స్మార్ట్ ఫోన్  6జీబీ  DDR4 ర్యామ్ + 64జీబీ UFS 2.1 స్టోరేజి , 6జీబీ DDR4 ర్యామ్ + 128జీబీ UFS 2.1 స్టోరేజి మరియు 8జీబీ DDR4 ర్యామ్ + 256జీబీ UFS 2.1 స్టోరేజిలను అందిస్తుంది. కొనుగోలుదారులు ఒక హైబ్రిడ్ స్లాట్ ద్వారా మెమరీని 256జీబీ వరకు విస్తరించడానికి ఒక ఎంపికను కలిగి ఉంటుంది. ఇంకా, ఈ ఫోన్లో 4,000 mAh బ్యాటరీ ఉంది, ఇది USB టైప్ సి పోర్ట్ ద్వారా ఛార్జ్ చేయబడుతుంది. ఈ స్మార్ట్ ఫోన్లో త్వరిత ఛార్జ్ 3.0 టెక్నాలజీ మరియు  స్పీడ్ ఛార్జర్ బాక్స్ తో పాటు వస్తుంది. షియోమీ తెలిపిన ప్రకారం 8 గంటల వరకు గేమింగ్ ని ఈ స్మార్ట్ ఫోన్ ఇవ్వగలదు.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :