డిజిట్ జీరో 1 అవార్డ్స్ 2018: ఉత్తమ బడ్జెట్ స్మార్ట్ ఫోన్ కోసం నామినేషన్స్

డిజిట్ జీరో 1 అవార్డ్స్ 2018: ఉత్తమ బడ్జెట్ స్మార్ట్ ఫోన్ కోసం నామినేషన్స్
HIGHLIGHTS

బడ్జెట్ స్మార్ట్ ఫోన్ల సెగ్మెంట్, మీరు చెల్లించే డబ్బుకు సరైన ఫోను పొందడానికి సహాయపడుతుంది. ఇక్కడ పనితీరు కీలకమైనది మరియు ఈ స్మార్ట్ ఫోను సరిగ్గా ఈ విభాగం కోసం ఎంపిక చేయబడ్డాయి. మీరు ఎంపిక చేసుకున్న స్మార్ట్ ఫోను ఏది?

బడ్జెట్ ఫోన్లు ఇకపై బోరింగ్ అనిపించేలా మాత్రం కచ్చితంగా ఉండబోవు. వాటి యొక్క పనితీరు పరంగా, ప్రస్తుతం అందుబాటులోవున్న బడ్జెట్ ఫోన్లు క్వాడ్ కెమెరాలు, నోచ్ డిస్ప్లేలు, గ్లాస్ డిజైన్లు మరియు వంటి మరికొన్ని గొప్ప లక్షణాలను అందిస్తున్నాయి. కానీ ఈ పరీక్షలో, వాటి యొక్క పనితీరు ఆధారంగా  ఈ సంవత్సరం ఉత్తమ బడ్జెట్ ఫోన్లు కోసం మా ఎంపికలు ఇక్కడ ఉన్నాయి.

అసూస్ జెన్ ఫోన్ మాక్స్ M1

జెన్ ఫోన్ మాక్స్ ప్రో M1 విజయం తర్వాత, అసూస్ బడ్జెట్ ధరలో చాలా స్థిరంగా మరియు ఉపయోగించడానికి నమ్మకమైన డివైజ్ ఈ అసూస్ జెన్ ఫోన్ మాక్స్ M1. ఇది ఒక ఆక్టా కోర్ స్నాప్ డ్రాగన్ ప్రాసెసర్ నుండి శక్తిని పొందింది మరియు Xiaomi యొక్క బడ్జెట్ ఫోన్ల శ్రేణితో, ఈ సంవత్సరంలో తీవ్రమైన పోటీని ఇచ్చింది. దీని యొక్క స్థిరమైన పనితీరు మరియు  4,000 mAh బ్యాటరీ,  అలాగే  కాంపాక్ట్ కారణంగా, మేము ఈ ఫోన్ను ఉత్తమ బడ్జెట్ స్మార్ట్ ఫోన్ కోసం నామినీగా ఎంపిక చేసుకున్నాము.

షావోమి రెడ్మి Y2

Xiషావోమి రెడ్మి Y2 , సెల్ఫీ- సెంట్రిక్ పరికరం వలె లక్ష్యంగా ఉండవచ్చు మరియు ఇది చాలా ఫోన్ల మాదిరిగానే,  పిక్సెల్-బిన్నింగ్ టెక్నిక్స్ ద్వారా  సెల్ఫీల కోసం బాగానే ఉంది, కానీ  గొప్ప పెర్ఫార్మెన్స్ లక్ష్యంగా మేము ఈ Redmi Y2 ను ఎంచుకున్నాము.  గత సంవత్సరం యొక్క అత్యంత ప్రజాదరణ పొందిన మధ్యస్థాయి చిప్సెట్ శక్తితో,  ఉత్తమ మధ్యస్థాయి స్మార్ట్ఫోనుగా మా జీరో 1 అవార్డు గెలుచుకున్న అదే చిప్ సెట్ కలిగి వుంది, మరియు  Redmi Y2 గేములతో సహా, చాలా సాధారణ పనులు నిర్వహించడానికి బాగా పనిచేస్తుంది.

స్మార్ట్రాన్ T. ఫోన్ P

ఇండియా – మేడ్ స్మార్ట్రాన్ ఒకటి, కానీ ఫంక్షనల్. ఇది నిజంగా సమ్మోహనపరిచేలా లేదు కానీ గాని నిరాశ కూడా పరచదు, ఇది దాని పనిని మాత్రం సక్రమంగా చేస్తుంది. ఇది స్టాక్ Android UI ను కూడా ఉపయోగిస్తుంది, ఇది విషయాలు సరిగ్గా ఉంచడంలో సహాయపడుతుంది. భారీ 5,000 mAh బ్యాటరీతో, ఇది కూడా చాలా ఎక్కువ చేసు సమర్ధవంతంగా పనిచేస్తుంది.

రియల్మీ 2

రియల్జ్ 2 సాధారణ బడ్జెట్ స్పెక్ షీట్ ను తీసుకువచ్చింది మరియు దానిని మరింత లాభదాయకంగా మార్చింది. మేము దాని పైభాగంలో  ' నోచ్  ' రూపకల్పన కోసం ఈ రియల్మీ 2 ను ఎంచుకున్నాము మరియు టాప్-ఆఫ్-లైన్ స్నాప్డ్రాగెన్ 450 చిప్సెట్ యొక్క పనితీరు మరియు మీ సోషల్ మీడియాకు వినియోగముతో సంతోషంగా ఉంచుకోవడానికి తగినంత మంచి కెమెరాని కలిగివున్నందుకు ఇది ఈ లిస్టులోచోటు సంపాదించుకుంది.

నోకియా 5.1 ప్లస్

పలురకాల మార్గాల్లో, ఈ నోకియా 5.1 ప్లస్ ఇతరులకన్నా ఎక్కువ ప్రతిభను కనబరుస్తుంది. ఇది సన్నని మరియు క్లాసిగా కనిపిస్తోంది. అలాగే, అది ఒక USB టైప్- C పోర్టుతో వస్తుంది. ఇది స్వచ్ఛమైన ఆండ్రాయిడ్తో పాటు చక్కగా మరియు శుభ్రంగా ఉంటుంది, ఇది సాధారణ నవీకరణల పొందేవిధంగా Android One యొక్క ధృవీకరణ పత్రంతో వస్తుంది. ఇది మరోసారి బడ్జెట్ చిప్సెట్లను తగ్గించే మీడియా టెక్ హెల్లియో P60 చేత శక్తినిస్తుంది. కానీ అన్ని ఉత్తమ బడ్జెట్ స్మార్ట్ఫోన్ కావడానికి అన్ని విషయాలను కలిగిఉంటుందా? చూద్దాం ఎవరు గెలవనున్నారో!

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo