మునుపటి సంవత్సరం వరకు కూడా ఒక ప్రధాన స్మార్ట్ఫోన్ అంత గొప్పగా, ఒక మధ్యస్థాయి ఫోన్ ఆకర్షినియంగా ఉందనే నమ్మకముంది. కానీ 2018 లో వచ్చిన, నోకియా 7 ప్లస్, షావోమి మి A2, రియల్మీ 2 ప్రో మరియు ఇటువంటి మరికొన్ని ఫోన్లు చూసినప్పుడు, అది తప్పనిపిస్తుంది. ఈ మిడ్-రేంజ్ ఫోన్లు, ఈ సంవత్సరం చాలా శక్తివంతమైన (మరియు మరింత ఖరీదైన) ఫ్లాగ్ షిప్ ఫోన్లకు వ్యతిరేకంగా తమ సొంత స్థానాన్నిఏర్పరుచుకొని మందుకుసాగాయి. దీని ప్రధాన కారణం అయినటువంటి, చిప్సెట్ మేకర్స్ మరియు AI పనితనానికి కృతజ్ఞతలు చెప్పవచ్చు. ఈ సంవత్సరం విడుదలైన మధ్యస్థాయి ఫోన్లలో కొన్ని సామర్ధ్యం, నమ్మకం మరియు ముఖ్యంగా, ఉత్తేజ పరిచేవిగా ఉన్నాయి. ఈ Digit Zero1 Awards లో, మేము ప్రతిఒక్క కేటగిరిలో ఉత్తమమైన పరికరాలు మరియు మధ్యస్థాయి ఫోన్లు (స్పష్టమైన విషయాల కోసం) ఫ్లాగ్ షిప్ స్థాయి వరకు చేరుకోవు కానీ, అంతసమర్ధతను చూపిస్తాయి. దానిని దృష్టిలో ఉంచుకుని, ఉత్తమ మిడ్-రేంజ్ స్మార్ట్ఫోన్ కోసం జీరో 1 అవార్డ్స్ 2018 కోసం నామినేషన్స్ పరిశీలించి చూద్దాం.
నోకియా 7 ప్లస్
ఈ నోకియా 7 ప్లస్, ఈ సంవత్సరంలో HMD గ్లోబల్ బ్రాండ్ తన బ్రాండ్ యొక్క గొప్పదనాన్ని పునర్నిర్మించటానికి చేసిన అన్ని అంశాల కలయికగా చెప్పుకోవచ్చు. మన్నికైన, మరియు అవాంతరం లేని వినియోగదారు అనుభవాన్ని కలిగి ఉన్న ఒక ప్రత్యేకమైన డిజైన్ తో, నోకియా 7 ప్లస్ అబ్బురపరుస్తుంది. క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 660 SoC మరియు నో-ఫ్రిల్స్ Android UI కారణంగా ఇది ప్రధానంగా ఉపయోగించడానికి ఒక సాదనం. వాస్తవానికి, ఈ నోకియా 7 ప్లస్ ఇటీవల ఆండ్రాయిడ్ 9 పై నవీకరణను అందుకున్న మొట్టమొదటి పరికరాల్లో ఒకటిగా మారింది. ఈ ఫోన్ యొక్క స్పెషల్ షీట్ ఖచ్చితంగా ఆకట్టుకుంటుంది కానీ ధర అధికంగా ఉంటుంది మరియు మేము ప్రస్తుతం ఈ నోకియా 7 ప్లస్ 2018 యొక్క ఉత్తమ మధ్యస్థాయి స్మార్ట్ఫోన్ అనేవిధంగా, తగినంత విలువ ప్రతిపాదన ఉంది.
షావోమి మి A2
షావోమి మి A2 కూడా దాదాపుగా నోకియా 7 ప్లస్ వంటి అదేఖచ్చితమైన వివరాలను కలిగి ఉంది , కానీ చాలా తక్కువ ధరలో వస్తుంది. మనకు ఏమితెస్తుంది? Mi A2 ఉపయోగించడానికి ఖచ్చితంగా చాలా సులభంగా మరియు వెనుకభాగంలో ఒక అద్భుతమైన కెమెరా కూడా కలిగిఉంది. అదనంగా, Android One ధృవీకరణ ఉంది, ఇది ఆండ్రాయిడ్ 9 పై సహా, సాధారణ నవీకరణలకు హామీ ఇస్తుంది . ఇది కూడా ఒక స్నాప్ డ్రాగన్ 660 ప్రాసెసర్ మరియు 4GB RAM, 64GB స్టోరేజితో చాలా చక్కగా ఉంది. ఈ స్పెక్-షీట్ లో ముఖ్యంగా ఆకట్టుకునే విషయం ఈ ఫోన్ యొక్క ధర. Mi A2 విజేత అవుతుందో లేదో? తెలుసుకోవడానికి వేచి ఉండండి.
హానర్ 8 X
పెద్ద – స్క్రీన్ ఫోన్లు తప్పనిసరిగా అత్యంత బరువైనవిగా ఉండరాదు మరియు హానర్ 8X దీనిని నిరూపించడానికి సరిగ్గా సరిపోతుంది. ఇది భారీ ప్రదర్శన అంచులు దాదాపు అన్ని వైపులా విస్తరిస్తాయి మరియు పైన నోచ్ ఉంటుంది, ఇది ఇతర ఫోన్లలోలాగా పెద్దగా ఉండదు. కానీ హానర్ 8X కేవలం ఒక పెద్ద స్క్రీన్ తో మాత్రమే ఉండదు, ఇది సరికొత్త కిరిన్ 710 SoC శక్తితో అధికమైన పనితీరును చేస్తుంది మరియు ఇది వెన్నవంటి మృదువైన పనితీరును అందిస్తుంది. అలాగే, దీనిలో AI అధిక మొత్తంలో అందించబడింది మరియు మేము ప్రస్తుతం హానర్ 8X యొక్క అన్ని లక్షణాలతో, ఈ జీరో 1 గౌరవానికి సరిపోతుందో లేదో అని పరీక్షిస్తున్నాయి.
అసూస్ జెన్ ఫోన్ మ్యాక్స్ ప్రో M1
ఈ అసూస్ జెన్ ఫోన్ మ్యాక్స్ ప్రో M1 ను విడుదలచేసినపుడు, షావోమి నుండి మార్కెట్ వాటిని చేజిక్కుంచుకోవడం కోసం తైవానీస్ దిగ్గజం, దీని తీసుకొచ్చినట్లు తెలుసుకోలేకపోయారు. కానీ అది అనుకున్నట్లుగానే చేసింది. ఆసూస్, డిమాండ్ లో ఉన్న అన్నిలక్షణాలను తెచ్చింది ఇందులో- కెమెరా లో పోర్ట్రైట్ మోడ్, యూనివిజం డిస్ప్లే, స్టాక్ Android మరియు ఒక భారీ 5,000 mAh బ్యాటరీని ఇందులో తీసుకొచ్చింది. ఆసూస్, ఈ ఫోన్ యొక్క యూనిట్లు అధికమొత్తంలో విక్రయించింది, మరియు మేము ప్రస్తుతం ఈ 2018 యొక్క ఉత్తమ మధ్యస్థాయి స్మార్ట్ఫోన్ Zero1 కోసం ఎంతమాత్రం పోటీకి నిలుస్తుందో వేచిచూడండి.
హువాయ్ P20 లైట్
భారతీయ విపణిలోకి హువాయ్ తిరిగి వచ్చాక, చైనీస్ కంపెనీ ద్వారా కేవలం ఒక ఒక ప్రధాన ఫోన్ మాత్రమే అందించింది. బదులుగా, అది మధ్య- స్థాయిలో చాలావాటిని విడుదల చేసింది, వాటిలో హువాయ్ పి 20 లైట్ దాని ఆసక్తికరమైన రంగుల వైవిధ్యాలు మరియు వెనుకవైపు కెమెరాతో అద్భుతంగా ఉంటుంది. ఇది కూడా Huawei యొక్క కిరిన్ 659 SoC తో ఒక మంచి ప్రదర్శన మరియు మొత్తంగా మంచి ప్రదర్శన అందిస్తుంది. కానీ అత్యుత్తమ మిడ్ -రేంజ్ కావడానికి సరిపోతుందా? మేము అన్నిపరీక్షలు పూర్తి చేసిన తర్వాత, త్వరలోనే తెలియచేస్తాము.