సామ్సంగ్ ఎక్సిక్యుటివ్, రీ ఇన్ జాంగ్ ఇంటర్నెల్ ఇన్వెస్టర్స్ మీటింగ్ లో సామ్సంగ్ పే పేమెంట్ సిస్టం సౌత్ కొరియా మరియు US లో లాంచ్ అవనుంది అని చెప్పారు. దీనితో పాటు సామ్సంగ్ నెక్స్ట్ హై ఎండ్ స్మార్ట్ ఫోన్ కూడా లాంచ్ అవనుంది అన్నారు. అయితే జాంగ్ పీమేంట్ సిస్టం జులై నెల నుండి సెప్టెంబర్ నెలకు వాయిదా అయ్యింది అని చివరిలో చెప్పారు
.తాజాగా జరిగిన ఈ మీటింగ్ లోని జాంగ్ మాటలు సామ్సంగ్ గేలక్సీ నోట్ 5 సెప్టెంబర్ లో లాంచ్ అవనుంది అనే దాని పై స్పెకులేషన్స్ వస్తున్నాయి. తాజాగా పోయిన నెలలోనే సామ్సంగ్ గెలాక్సీ S6 రిలీజ్ కు నోచుకుంది కాబట్టి, ఇక రాబోయే హై ఎండ్ మోడల్ సామ్సంగ్ నోట్ 5 అని కన్ఫర్మ్ అయ్యింది. ఆపిల్ పే మెంట్ సిస్టం లాంచ్ అయ్యి సంవత్సరం అయ్యింది. అయితే ఈ సమయంలో గూగల్ పేమెంట్స్ మరియు సామ్సంగ్ పేమెంట్స్ వెంటనే లాంచ్ చేయాలి అని ప్లాన్స్ చేస్తున్నాయి రెండు మొబైల్ మార్కెట్ దిగ్గజాలు. సామ్సంగ్ పే తన సొంత ఫోన్స్ లో ప్రీ లోడ్ చేసుకునే ఆప్షన్ ఉంది కాబట్టి, సామ్సంగ్ పే సక్సెస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అలాగే గూగల్ కూడా ఆండ్రాయిడ్ వంటి ఓపెన్ సోర్స్ ఆపరేటింగ్ సిస్టం తో ఉండటం వలన ఈ రెండు పేమెంట్స్ ఆపిల్ కు పోటీ గా ఉంటాయి అని టాక్.
అయితే ఒక పక్క NFC పేమెంట్స్ సిస్టమ్స్ ప్రస్తుతం మార్కెట్ లో ఎక్కువ స్ప్రెడ్ అవలేకపోయింది. ఇండియా లాంటి దేశాలలో అయితే NFC ను వాడెంత ఇన్ఫ్రా స్ట్రక్చర్ కూడా లేదు.
NOTE: పైన చూపించిన ఫోటో కేవలం ఇమేజినరి మోడల్.