Cyanogen Inc. 2016 లో కొత్తగా బడ్జెట్ హాండ్ సెట్స్ ను లాంచ్ చేయనుంది అని కొన్ని హింట్స్ వస్తున్నాయి. ఇందుకోసం కంపెని ప్రొడక్షన్ కొరకు ఇతర తయారీ కంపెనీలతో ఒప్పందాలు కూడా చేసుకుంది.
ఇవి 5000 రూ నుండి 7000 రూ బడ్జెట్ లలో అందుబాటులోకి వస్తాయి. అయితే ఈ బడ్జెట్ లో ఇప్పటికే చాలా కాంపిటేషన్ ఉంది. కానీ కంపెని ప్రత్యేకంగా కొన్ని ఆప్షన్స్ ఇస్తుంది.
bloatware (అంటే Uninstall చేయటానికి వీలు లేని అనవసరమైన యాప్స్) ఏమీ లేకుండా మొబైల్స్ ను లాంచ్ చేయటం, మరొకటి Cyanogen OS ఫ్రిక్వెంట్ అప్ డేట్స్.
ఈ రెండూ నిజంగా మరే ఇతర బ్రాండ్ ఇవటం లేదు. ఈ ఫోనుల్లో Cyanogen OS 13 రన్ అవుతుంది. అంటే ఆండ్రాయిడ్ 6.0 ఉంటుంది. Cyanogen టీమ్ మెంబర్ మాటల ప్రకారం కంపెని ఒక ఫ్లాగ్ షిప్ మోడల్ కూడా లాంచ్ చేయనుంది ఫ్యూచర్ లో.
అయితే ఇవే లెక్కలతో గతంలో గూగల్ ఆండ్రాయిడ్ వన్ పేరుతో కొన్ని మొబైల్స్ లాంచ్ చేసింది. కాని అది అంతగా సక్సెస్ కాలేకపోయింది.