సామ్సంగ్ గెలాక్సీ నోట్ 5 స్మార్ట్ ఫోన్ అఫిషియల్ అనౌన్స్ అయ్యింది నిన్న. కంపెని కొత్త ఫ్లాగ్ షిప్ మోడల్ లో Exysno 7 ఆక్టో కోర్ ప్రొసెసర్ వాడింది S6 వలె. కాని దీనిలో 4GB ర్యామ్ ఉంది. 16MP అండ్ 5MP కేమేరాస్ ఉన్నాయి. నోట్ 4 వలె నోట్ 5 కూడా 5.7 in QHD(క్వాడ్ HD – నాలుగు రెట్లు HD) S-Amoled డిస్ప్లే తో వస్తుంది. ఫోన్ బిల్డ్ కోసం వాడిన మేతెరియల్స్ మాత్రం మారాయి. ఫోన్ బ్యాక్ సైడ్ S6 ఎడ్జ్ మోడల్(ఫ్రంట్ సైడ్) వలె curved గ్లాస్ ఇచ్చింది.
US లో ఆగస్ట్ 21 నుండి సేల్ అవుతుంది. ఇండియన్ మార్కెట్ సేల్ పై ఇంకా కంపెని వెల్లడించలేదు. సామ్సంగ్ గేలక్సీ నోట్ 5 ధర ఇంకా అఫిషియల్ గా రాలేదు కాని గత సంవత్సరం రిలీజ్ అయిన నోట్ 4 మోడల్ స్టార్టింగ్ ప్రైస్ లానే దీని ధర కూడా ఉంటుంది అని అంచనా.
రిమేనింగ్ స్పెసిఫికేషన్స్ లోకి వెళితే…నోట్ 5 కెమేరాకు f/1.9 aperture మరియు OIS, 4G ఉన్నాయి. 32 అండ్ 64 GB స్టోరేజ్ వేరియంట్స్ ఆండ్రాయిడ్ 5.1.1 తో సేల్ అవుతుంది. 3,000 mah బ్యాటరీ తో వైర్ లెస్ అండ్ క్విక్ చార్జింగ్ రెండూ ఇది సపోర్ట్ చేస్తుంది. దీనిలో S పెన్ కూడా ఉంది. మీ ఫేవరేట్ యాప్స్ ను మరియు డ్రాయింగ్ పనులకు ఇది పనిచేస్తుంది.
ఇదే మోడల్ తో సామ్సంగ్ గేలక్సీ S6 ఎడ్జ్ ప్లస్ కూడా లాంచ్ అయ్యింది. సేమ్ నోట్ 5 స్పెసిఫికేషన్స్ దీనికి కూడా ఉన్నాయి కాని దాని కన్నా పెద్ద సైజ్ అండ్ డ్యూయల్ ఎడ్జ్ డిస్ప్లే తో వస్తుంది ఇది.
అప్ కమింగ్ స్మార్ట్ వాచ్ కూడా రివీల్ చేసింది సామ్సంగ్. దీని పేరు సామ్సంగ్ Gear S2. IFA లో నెక్స్ట్ month బెర్లిన్ లో రౌండ్ డిస్ప్లే తో లాంచ్ అవనుంది. నిన్న జరిగిన ఈవెంట్ లో సామ్సంగ్ పేమెంట్ సిస్టం గురించి కూడా అఫిషియల్ అనౌన్స్ ఇచ్చింది కంపెని.