బెంగుళూరులోని స్టార్ట్ అప్ కంపెని, CREO స్మార్ట్ ఫోన్ ను రిలీజ్ చేస్తుంది అని ఇంతకముందు చెప్పుకోవటం జరిగింది. ఈ రోజు కంపెని Mark 1 పేరుతో ఫోన్ ను లాంచ్ చేసింది.
ప్రైస్ – 19,999 రూ. CREO ప్రత్యేకత ఏంటంటే స్మార్ట్ ఫోన్ కు ప్రతీ నెల useful ఫీచర్స్ తో కొత్త అప్ డేట్స్ ను ఇస్తుంది. అప్ డేట్స్ ఏదో పేరుకి కాకుండా నిజంగా కొత్త కొత్త ఫీచర్స్ ను యాడ్ చేస్తాయని అంటుంది.
దీనిలో ఆండ్రాయిడ్ based FUEL OS తో వస్తుంది. ఫ్లిప్ కార్ట్ లో లేదా కంపెని సొంత వెబ్ సైట్ లో సేల్స్ స్టార్ట్ అవుతాయి. ఫోన్ లో ప్రత్యేకంగా మూడు ఫీచర్స్ వస్తున్నాయి..
ఒకటి Retriever, ఇది ఫోన్ లో ఎవరైనా కొత్త సిమ్ వేస్తె ఆటోమేటిక్ గా ఇంటర్నెట్ లేకపోయినా ఫోన్ ను ఫ్యాక్టరీ రిసేట్ చేసినా మెయిల్ పంపిస్తుంది.
రెండవది ECHO. ఇది కాలర్స్ కాల్స్ ను లిఫ్ట్ చేసి వాళ్ళ మెసేజ్ లను రికార్డ్ చేస్తుంది ఒక వేల యూసర్ ఫోన్ లిఫ్ట్ చేయకపోతే. ఇక మూడవది – SENSE, ఇది ఫోన్ హోమ్ బటన్ పై డబుల్ టాప్ చేస్తే ఏదైనా సర్చ్ చేస్తుంది.
స్పెసిఫికేషన్స్ – Creo మార్క్ 1 మెటల్ బాడీ మరియు డ్యూయల్ సిమ్ తో వస్తుంది. ఇంకా 5.5 in Quad HD 2.5D గ్లాస్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ డిస్ప్లే ఉంది.
మీడియా టెక్ Helio X10 1.95GHz ప్రొసెసర్, 3GB ర్యామ్, 32GB ఇంబిల్ట్ స్టోరేజ్, 128GB SD కార్డ్ సపోర్ట్, 3100 mah బ్యాటరీ ఉన్నాయి.
కెమేరా విషయానికి వస్తే 21MP సోనీ Exmor IMX230 రేర్ కెమేరా with PDAF అండ్ 4K వీడియో రికార్డింగ్ సపోర్ట్ అండ్ 120fps అల్ట్రా slow మోషన్ వీడియో రికార్డింగ్ in ఫుల్ HD ఉన్నాయి.
ఫ్రంట్ లో 8MP కెమేరా 86 degree wide లెన్స్ తో వస్తుంది. 4G ఇంటర్నెట్ కనెక్టివిటి. Refuel యాప్ – దీనిలో users కు కావలసిన ఫీచర్స్ ను నెక్స్ట్ అప్ డేట్ లో ఇవ్వమని ఆడగలరు, ఇంకా టిప్స్ అండ్ సపోర్ట్.
ఆల్రెడీ నెక్స్ట్ అప్ డేట్ మే 13 న ఇవనున్నట్లు తెలిపింది కంపెని. దీనిలో ఫోటో ఎడిటర్, సేల్ఫీ స్క్రీన్ ఫ్లాష్, ఆటోమేటిక్ బ్యాక్ గ్రౌండ్ డేటా మేనేజర్, ఆటో అండ్ customisable Echo అండ్ సెన్స్ 2.0 అప్ డేట్ కానున్నాయి.