Coolpad Note 8 మీడియా టెక్ 6750T SoC, 5.99- అంగుళాల డిస్ప్లే మరియు 4000mAh బ్యాటరీ కలిగి, ఇండియాలో Rs. 9,999 ధరతో విడుదలైంది
ఈ కూల్ ప్యాడ్ నోట్ 8 యొక్క 4GB ర్యామ్ మరియు 64GB స్టోరేజి బ్లాక్ పియానో కలర్ వేరియంట్ ఇపుడు పేటిఎమ్ మాల్ లో అందుబాటులోవుంది.
Coolpad 5A, బడ్జెట్ స్మార్ట్ ఫోన్ ఇండియాలో విడుదల చేసిన రెండు నెలల తారువాత, ఈ Coolpad Note 8 ని ఆవిష్కరించింది. ఈ స్మార్ట్ ఫోన్ ఇపుడు, Rs. 9,999 ధరతో బ్లాక్ పియానో రంగు వేరియంట్ పేటిఎమ్ మాల్ లో అందుబాటులోవుంది. ఈ ఫోన్ ఒక 4000mAh బ్యాటరీ, పేస్ అన్లాక్, మరియు రియర్ డ్యూయల్ కెమేరా శెట్పతో వస్తుంది. ఈ కూల్ ప్యాడ్ నోట్ 8 ఫోన్ ఈ సంవత్సరం మే నెలలో వచ్చిన, కూల్ ప్యాడ్ నోట్ 6 కి తరువాతి నోట్ ఫోనుగా ఉంటుంది.
Coolpad Note 8 ప్రత్యేకతలు
ఈ స్మార్ట్ ఫోన్ 18:9 యాస్పెక్ట్ రేషియోతో 1080 x 2160 పిక్సెళ్ళు అందించగల ఒక 5.99 అంగుళాల Full -HD+ డిస్ప్లే తో వస్తుంది. ఈ ఫోన్ 1.5GHz వద్ద క్లాక్ చేయబడిన క్వాడ్ – కోర్ మీడియా టెక్ 6750T SoC శక్తితో ఉంటుంది. ఈ ప్రాసెసర్ మాలీ T860-MP2 GPU తో జతచేయబడి ఉంటుంది మరియు 4GB ర్యామ్ మరియు 64GB అంతర్గత స్టోరేజి, ఇంకా దీనిని మైక్రో SD కార్డుతో 128GB వరకు విస్తరించవచ్చు. ఈ డ్యూయల్ సిమ్ స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ ఓరెయో 8.0 తో నడుస్తుంది మరియు కస్టమ్ క్విక్ లంచ్ కోసం ఇది టచ్ కంట్రోల్ ఆదేశాలకు సపోర్ట్ చేస్తుందని కంపెనీ చెబుతోంది.
కెమేరా విభానికి వస్తే, ఈ కూల్ ప్యాడ్ నోట్ 8 నిలుగా అమర్చిన డ్యూయల్ కెమేరా సెట్పాతో వస్తుంది. ఇందులో f/2.0 ఆపేర్చేర్ మరియు ఆటో ఫోకస్ గల ఒక ప్రధాన 16 MP కెమేరా తో పాటుగా, 0.3MP కెమేరా జతగా ఉంటుంది. ఈ కెమేరాతో పాటుగా LED ఫ్లాష్ కూడా ఉంటుంది దాని పక్క వైపున మరియు కెమేరాకు దిగువ భాగంలో ఫింగర్ ప్రింట్ సెన్సార్ ని కూడా అందించారు. ఏ ఫింగర్ ప్రింట్ సెన్సార్ కేవలం 0.2 సెకేన్ల లోనే ఫోన్ని అన్లాక్ చేస్తుందని కంపెనీ పేర్కొంది. ముందు భాగంలో, f/2.2 ఆపేర్చేర్ గల ఒక 8MP కెమేరా ఉంటుంది. ఈ స్మార్ట్ ఫోన్ ఒక పెద్ద 4000mAh బ్యాటరీతో వస్తుంది మరియు ఇది 200 స్టాండ్ బై మరియు 8 గంటల టాక్ టైం అందిస్తుందని కంపెనీ తెలిపింది.