coolpad కంపెనీ ముందుగా కూల్ పాడ్ నోట్ 3 కు మార్ష్ మల్లో ఆండ్రాయిడ్ అప్డేట్ ను రిలీజ్ చేయగా, ఇప్పుడు 6,999 రూ కూల్ పాడ్ నోట్ 3 లైట్ కు కూడా ఆండ్రాయిడ్ 6.0 మార్ష్ మల్లో అప్డేట్ ను రిలీజ్ చేసింది.
అయితే ఇది OTA అప్డేట్ కాదు, మీరు manual గా SP flash టూల్ ద్వారా flash చేసుకోవాలి. ఇందుకు రూటింగ్ అవసరం లేదు. చేసుకునే ముందు మీ ఫోన్ లో ఏ వెర్షన్ లేదా ఏ custom rom లో ఉన్నా ఫర్వాలేదు.
ఈ లింక్ లోకి వెళ్లి ఫైల్ ను డౌన్లోడ్ చేసుకోండి . ఏలా flash చేయాలనేది ఈ లింక్ లో ఉంది. అయితే flash చేసే ముందు ఫోన్ కు సంబంధించి కంప్లైట్ డ్రైవర్స్ ఎలా ఇంస్టాల్ చేయాలో ఈ లింక్ లో చూడగలరు.
MM (మార్ష్ మల్లో ) అప్డేట్ ను మరొక పద్దతిలో కూడా ఇంస్టాల్ చేసుకోగలరు. అదే recovery flashing. మీ ఫోన్ లో ఆల్రెడీ custom (like twrp) ఉంటే జస్ట్ recovery లోకి వెళ్లి ఈ లింక్ లో ఉన్న flashable zip ను flash చేయటమే. ఇదే లింక్ లో ప్రోసెస్ కూడా ఉంది.
గమనిక: మీకు పైన పేర్కొన్న వాటిపై అవగాహన లేనప్పుడు, తెలుసుకొని చేసుకోండి. blind గా proceed అయిపోకండి. ఫోన్ పనిచేయకుండా పాడయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. coolpad note 3 complete review here – link