ఇండియాలో ఈ రోజు కూల్ ప్యాడ్ కొత్త వేరియంట్ రిలీజ్ చేసింది. పేరు కూల్ ప్యాడ్ నోట్ 3 ప్లస్. దీనిలో కేవలం ఫుల్ HD డిస్ప్లే ఒకటే అదనంగా వస్తుంది. మిగిలిన స్పెక్స్ అన్నీ సేమ్.
కూల్ పాడ్ నోట్ 3 plus ప్రైస్ – 8,999 రూ. అమెజాన్ లో May 13 నుండి సెల్ కానుంది. గోల్డ్ అండ్ వైట్ రెండు కలర్స్ లో అందుబాటులోకి వస్తుంది.
ఇంతకుముందు డిజిట్ తెలుగు చెప్పినట్లు గానే కూల్ ప్యాడ్ నోట్ 3 ప్రైస్ ను కంపెని 8,999 నుండి 8,499 రూ లకు తగ్గించటానికి కారణం ఇదే.
సేమ్ స్పెక్స్ అయినా ఒక సారి నోట్ 3 ప్లస్ లో స్పెసిఫికేషన్స్ ఏమ్మున్నాయి చూడండి.. 5.5 in ఫుల్ HD డిస్ప్లే, 3GB ర్యామ్, 1.3Ghz ఆక్టో కోర్ మీడియా టెక్ 6753 SoC.
డ్యూయల్ sim(రెండూ మైక్రో), 4G, 16GB ఇంబిల్ట్ స్టోరేజ్ అండ్ 64GB sd కార్డ్ సపోర్ట్, 3000 mah బ్యాటరీ 13MP రేర్ అండ్ 5MP ఫ్రంట్ కేమేరాస్.
ఫింగర్ ప్రింట్ స్కానర్ తో ఫోన్ 168 గ్రా బరువు కలిగి ఉంది. బరువు విషయంలో slight గా plus వేరియంట్ పెరిగింది అని చెప్పాలి note 3 కన్నా.
కంపెని కూడా కేవలం బ్లాక్ వేరియంట్ ప్రైస్ నే 500 రూ తగ్గించింది, వైట్ కలర్ నోట్ 3 ఫోన్ 8,999 రూ లకె ఉంచింది. అంటే ఫుల్ HD అయినా HD అయినా ఒకే ప్రైస్ కు అమ్ముతుంది ప్రస్తుతం.
కూల్ ప్యాడ్ నోట్ 3 కంప్లీట్ రివ్యూ లింక్
కూల్ ప్యాడ్ నోట్ 3 Lite రివ్యూ లింక్
కూల్ ప్యాడ్ నోట్ 3 బ్లాక్ వేరియంట్ ను ఈ లింక్ లో 8,499 రూ లకు కొనండి అమెజాన్ లో..
కూల్ ప్యాడ్ నోట్ 3 Lite ను ఈ లింక్ లో 6,999 రూ లకు అమెజాన్ లో కొనండి.