అఫీషియల్ గా కూల్ ప్యాడ్ నోట్ 3 ప్రైస్ తగ్గించింది కంపెని

అఫీషియల్ గా కూల్ ప్యాడ్ నోట్ 3 ప్రైస్ తగ్గించింది కంపెని

కూల్ ప్యాడ్ నోట్ 3 ఇప్పుడు తగ్గింపు ప్రైస్ తో వస్తుంది. ఇప్పటివరకు ఫోన్ 8,999 రూ లకు సెల్ అయ్యింది. ఈ రోజు నుండి బ్లాక్ వేరియంట్ మోడల్ 8,499 రూ లకు సెల్ అవుతుంది. వైట్ వేరియంట్ మాత్రం 8,999 సేమ్ ప్రైస్.

అంటే 500 రూ తగ్గింది. ఫోన్ కేవలం అమెజాన్ ఇండియాలో మాత్రమే సెల్ అవుతుంది. కంపెని ప్రైస్ తగ్గించటానికి కారణం సబ్ 10K సెగ్మెంట్ లో నంబర్ వన్ స్మార్ట్ ఫోన్ గా కంటిన్యూస్ గా పేరు సంపాదించుకున్నందుకు అని చెబుతుంది.

ఇది ఇలా ఉంటె కూల్ ప్యాడ్ నుండి మరొక కొత్త మోడల్ త్వరలో రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అని తెలుస్తుంది. అందుకే  ప్రివియస్ మోడల్ ప్రైస్ తగ్గించింది అని అంచనా.

దీనిలో 5.5 ఇన్ HD డిస్ప్లే, 3GB ర్యామ్, 16GB స్టోరేజ్, ఫింగర్ ప్రింట్ స్కానర్, 4G LTE, డ్యూయల్ సిమ్ స్లాట్, 13MP అండ్ 5MP కేమేరాస్, 3000 బ్యాటరీ ఉన్నాయి.

కూల్ ప్యాడ్ అతి త్వరలోనే ఆండ్రాయిడ్ మార్ష్ మల్లో అప్ డేట్ ను లాంచ్ చేయనుంది ఇండియన్ ఫోనులకు. ఈ అప్ డేట్ లో కంపెని చేసిన సూపర్బ్  UI మార్పులు మరియు కొత్త ఫిచర్స్ ను ఈ లింక్ లో తెలుసుకోండి.

ఈ ఫోన్ యొక్క కంప్లిట్ రివ్యూ ఈ లింక్ లో చూడండి..

Press Release
Digit.in
Logo
Digit.in
Logo