ఇండియాలో కూల్ ప్యాడ్ నోట్ 3 users కు మొన్న రాత్రి కంపెని మార్ష్ మల్లో 6.0.1 అప్ డేట్ ను రిలీజ్ చేసింది. అయితే ఇది కంప్లీట్ stable బిల్డ్ కాదు. డెవలపర్స్ వీటిని సాల్వ్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
stable build కాదు అంటే?
అప్ డేట్ లో కొన్ని bugs ఉన్నాయి. అయితే ఇవి పెద్ద ఇబ్బందికరమైన బగ్స్ కాదు. VoLTE పనిచేయటం లేదు, ఫ్రంట్ కెమెరా అప్పుడప్పుడు బ్లాంక్ అయిపోతుంది అండ్ కాల్స్ లో నాయిస్ ఉంటుంది.
ఎలా అప్ డేట్ చేసుకోవాలి?
ఇది OTA అప్ డేట్ కాదు. manual గా SP Flash టూల్ ద్వారా చేసుకోవాలి అప్ డేట్. మీరు జనరల్ user అయితే ఇది చేసుకోవటం కష్టం. రూటింగ్, ఫ్లాషింగ్ వంటి మెథడ్స్ తెలిసిన వారికీ సులభమే.
అయితే ఇప్పటికిప్పుడు మీరు తెలుసుకొని చేసుకోవటం కూడా సింపుల్ ప్రోసెస్. ఓపిక ఉండాలి అంతే! 🙂 ఎందుకంటే మమూలగానే ఇది ఈజీ ప్రోసెస్ పైగా కూల్ ప్యాడ్ లో bootloader unlocking కాన్సెప్ట్ కూడా అవసరం లేదు. జస్ట్ ఫైల్ డౌన్లోడ్ చేయటం, ఫ్లాష్ టూల్ లో సెలెక్ట్ చేయటం అంతే!
ఈ లింక్ లో ఉన్న SP Flash tool ట్యుటోరియల్ ద్వారా మీరు మార్ష్ మల్లో అప్ డేట్ ను ఎలా ఇంస్టాల్ చేసుకోవాలో తెలుసుకోండి. మార్ష్ మల్లో అప్ డేట్ ను ఈ లింక్ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీరు forums లో లాగిన్ అయితేనే డౌన్లోడ్ ఫైల్స్ కనిపిస్తాయి.
ఇది పబ్లిక్ build ఏ కాని బీటా వెర్షన్. సో పైన చెప్పని minor bugs ఉండే అవకాశాలు ఉన్నాయి. కంపెని త్వరలోనే దీనికి మరో అప్ డేట్ ఇస్తున్నట్లు తెలిపింది. అవును కూల్ ప్యాడ్ నోట్ 3 Lite users కు ఇంకా రిలీజ్ కాలేదు ఆండ్రాయిడ్ 6.0.1. జూన్ మూడవ వారం లోపు Lite users కు కూడా మార్ష్ మల్లో అప్ డేట్ వస్తుంది.
stable build కాదు, పైగా ఫ్లాషింగ్ manual గా చేసుకోవాలి. సో ఇంత రిస్క్ అవసరమా ఈ అప్ డేట్ కు?
ఈ ప్రశ్నకు మీ ఇంటరెస్ట్ బట్టి సమాధానం ఉంటుంది. roms, రూటింగ్, ఫ్లాషింగ్ వంటి వాటిపై curiousity లేకపోతే చేసుకోకండి. ఈ అప్ డేట్ లో కంపెని ఇచ్చే మార్పులను, అదనపు ఫీచర్స్ ను లుక్స్ ను తెలుసుకోవటానికి ఈ లింక్ లోకి వెళ్ళండి. రూటింగ్ గురించి తెలియని వారు ఇక్కడ కంప్లీట్ గైడ్ చూడండి.