Coolpad నుండి ఇండియన్ మార్కెట్ లో కొత్త స్మార్ట్ ఫోన్ రిలీజ్ అయ్యింది. దీని పేరు Mega 2.5D. పేరుగా నార్మల్ గా లేదు ప్రైస్ కూడా నార్మల్ గా ఉండదు అనుకోకండి.
దీని ప్రైస్ 6,999 రూ. హై లైట్ అని చెప్పుకోవటానికి ఫ్రంట్ లో 8MP కెమెరా ఉంది. అయితే same ఇదే pricing లో కూల్ ప్యాడ్ నోట్ 3 lite కూడా ఉంది. సరే Mega 2.5D ఇతర స్పెక్స్ విషయానికి వస్తే…
డ్యూయల్ సిమ్,1GHz మీడియా టెక్ MT6735P క్వాడ్ కోర్ ప్రొసెసర్ (ఇది MT6735 SoC కన్నా తక్కువ పవర్ కలిగిన చిప్ సెట్ మోడల్), 3GB ర్యామ్, 16GB ఇంబిల్ట్ స్టోరేజ్.
32GB sd కార్డ్ సపోర్ట్, 5.5 in HD 2.5D గ్లాస్ డిస్ప్లే, 2500 mah బ్యాటరీ, ఆండ్రాయిడ్ 6.0 బేస్డ్ కూల్ ప్యాడ్ UI 8.0, 8MP సోనీ సెన్సార్ రేర్ కెమెరా ఉన్నాయి.
4G LTE ఇంటర్నెట్ కనెక్టివిటి ఉంది ఫోన్ లో. VoLTE కూడా సపోర్ట్ చేస్తుంది. అమెజాన్ లో 24 మధ్యాహ్నం 2 గం నుండి సేల్స్ స్టార్ట్. ఫోన్ ఫుల్ మెటల్ ఫినిషింగ్ తో వస్తుంది.
రేపు 5 PM కు రిజిస్ట్రేషన్స్ స్టార్ట్ అవుతున్నాయి. ఫోన్ బరువు 140 గ్రా. బేసిక్ గా కంపెని ఈ మోడల్ ను సేల్ఫీ ప్రియుల కోసం లాంచ్ చేసింది అని తెలుస్తుంది.