కూల్ ప్యాడ్ Dazen x7 మరియు Dazen 1 పేర్లతో రెండు ఆండ్రాయిడ్ ఆధారిత స్మార్ట్ ఫోన్ లను కొత్తగా లాంచ్ చేసింది. ఇది కూల్ ప్యాడ్ కు స్మార్ట్ ఫోన్ మార్కెట్ లో మొదటి అడుగు. స్నాప్ డీల్ సైటు ద్వారా జూన్ 9 నుండి Dazen x7 17,999 రూ. లకు Dazen1 6,999 రూ. లకు లభ్యం కానున్నాయి.
Dazen x7 స్పెసిఫికేషన్స్ – 5 in ఫుల్ HD, ఆండ్రాయిడ్ 4.4.2, కస్టమైజ్డ్ కూల్ ప్యాడ్ యూజర్ ఇంటర్ఫేస్, 1.7 GHz ఆక్టో కోర్ ప్రాసెసర్, 2 జిబి ర్యామ్, 13MP బ్యాక్ కెమేరా, 8MP ఫ్రంట్ కెమేరా , 16జిబి ఇంటర్నెల్ స్టోరేజ్, 2700 mah బ్యాటరీ, డ్యూయల్ సిమ్, 4జి కనెక్టివిటి.
Dazen x7 రెండు కలర్స్ లో లభ్యం అవనుంది. ఒకటి, గోల్డ్ మరొకటి వైట్.
కూల్ ప్యాడ్ Dazen x1 స్పెసిఫికేషన్స్ – 5in 720P డిస్ప్లే, 4.4.4, కస్టమైజ్డ్ కూల్ ప్యాడ్ యూజర్ ఇంటర్ఫేస్, 1.2GHz క్వాడ్ కోర్ క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 410 ప్రాసెసర్, 2జిబి ర్యామ్, 8జిబి ఇంబిల్ట్ మెమరి, 8MP బ్యాక్ మరియు 5MP ఫ్రంట్ కెమేరా, 2500 mah బ్యాటరీ, డ్యూయల్ సిమ్, LTE. దీని ధర 6,999 రూ. ధర బడ్జెట్ లో ఉండటం వలన కూల్ ప్యాడ్ Dazen1 లెనోవో A6000 సిరిస్ మరియు రెడ్మి 2 తో పోటి పడనుంది. మేము 10,000రూ. లకు చేసిన ఫోన్స్ లిస్టు ఇక్కడ చుడండి.
ఇండియన్ స్మార్ట్ ఫోన్ మార్కెట్ చాలా జోరుగా ఉంది. మొన్న Xiaomi, నిన్న Meizu, Nubia, InFocus, ఈ రోజు కూల్ ప్యాడ్ కంపెనీ లు స్మార్ట్ ఫోన్ మార్కెట్ లోకి ఎంటర్ అవుతూ ఇండియాలో అమ్మకాలు జరుపుతున్నాయి. ఇన్ని కంపెనీల పోటిలో కూల్ ప్యాడ్ ఎలా నిలదక్కుకోనుందో వేచి చూద్దాం.