LeEco & కూల్ ప్యాడ్ కలిసి 4GB ర్యామ్ తో మొదటి స్మార్ట్ ఫోన్ రిలీజ్ చేశాయి

Updated on 16-Aug-2016

మీరు కూల్ ప్యాడ్ బ్రాండ్ లో LeEco మేజర్ షేర్స్ కొనింది అని విన్నారా? ఇది జరిగిన తరువాత కూల్ ప్యాడ్ చైర్మన్ ప్లేస్ లో LeEco సీఈఓ replace అవటం కూడా జరిగింది.

ఇది జరిగిన వారం రోజులలో రెండు కంపెనీలు కలిసి మొట్ట మొదటి ఫోన్ రిలీజ్ చేశాయి. స్మార్ట్ ఫోన్ పేరు Cool 1 Dual. ఇది రెండు వేరియంట్స్ లో వస్తుంది.

ఒకటి 3GB ర్యామ్, 32GB స్టోరేజ్. దీని ప్రైస్ సుమారు 11,100 రూ. రెండవ వేరియంట్ 4GB ర్యామ్, 32GB స్టోరేజ్. దీని ప్రైస్ సుమారు 15,100 రూ. 4GB, 64GB స్టోరేజ్ వేరియంట్ కూడా ఉంది. దీని ప్రైస్ సుమారు 17 వేలు.

ఇక స్పెక్స్ విషయానికి వస్తే ఫోన్ లో ప్రధాన highlight వెనుక రెండు 13MP కేమేరాస్ ఉన్నాయి. దీనికి PDAF, 4K వీడియో రికార్డింగ్, డ్యూయల్ tone LED flash, 720P స్లో మోషన్ రికార్డింగ్ ఉన్నాయి.

డ్యూయల్ సిమ్, 5.5 in FHD IPS 450nit brightness IPS డిస్ప్లే, స్నాప్ డ్రాగన్ 652 ఆక్టో కోర్ SoC, adreno 510 GPU, 8MP ఫ్రంట్ కెమెరా.

ఆండ్రాయిడ్ 6.0 మార్ష్ మల్లో based EUI 5.6(LeEco యుజర్ ఇంటర్ఫేస్), 4060 mah బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్, 4G LTE with VoLTE సపోర్ట్, బ్లూ టూత్ 4.1

USB టైప్ C పోర్ట్ తో ఫోన్ గోల్డ్, సిల్వర్ మరియు రోజ్ గోల్డ్ కలర్స్ లో వస్తుంది. LeMall.com, coolpad అఫీషియల్ సైట్ మరియు JD.com సైట్స్ లో china లో ప్రీ ఆర్డర్స్ మొదలు. ఆగస్ట్ 24 న సేల్స్. ఇండియన్ మార్కెట్ కు ఎప్పుడు అనేది ఇంకా స్పష్టత లేదు.

 

PJ Hari

Gadget Geek. Movie Buff. Non fiction Books

Connect On :