6GB రామ్ తో LeEco అండ్ Coolpad పార్టనర్ షిప్ లో వస్తున్న కొత్త ఫోన్
LeEco మరియు Coolpad – ఈ రెండు కంపెనీలు కలిసి ఒక స్మార్ట్ ఫోన్స్ రిలీజ్ చేయనున్నాయి అనేది తెలిసిన విషయమే. ఎందుకంటే ఆగస్ట్ లో రెండూ జతకలిసి కూల్1 డ్యూయల్ అనే 4GB ram ఫోన్ ను రిలీజ్ చేశాయి చైనా లో.
ఇది ఇండియాకు ఎప్పుడు వస్తుందో ఇంకా స్పష్టత లేదు. ఈ లింక్ లో కూల్ 1 డ్యూయల్ ఫోన్ యొక్క స్పెక్స్ చూడగలరు. ఇది ఇలా ఉంటే ఈ రెండు కంపెనీల సిరిస్ లో మరొక ఫోన్ కూడా రిలీజ్ అవనుంది అని తెలుస్తుంది.
చైనీస్ సర్టిఫికేషన్ సైట్, TENAA లో ఈ ఫోన్ ఇన్ఫర్మేషన్ బయటపడింది. ఆ సైట్ లో జరిగిన లీక్స్ ప్రకారం కొత్త ఫోన్ లో 5.5 in 1080P డిస్ప్లే..
2.35GHz స్నాప్ డ్రాగన్ 821 లేటెస్ట్ ప్రొసెసర్, 4GB అండ్ 6GB రామ్స్, 32/64 అండ్ 128GB ఇంబిల్ట్ స్టోరేజ్ ఆప్షన్స్, 4000 mah బ్యాటరీ ఉండనున్నాయి. ఫోన్ యొక్క డిజైన్ కూడా LeEco ఫోన్ వలే కనిపిస్తుంది.
Team Digit
Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile