ఇండియాలో 4GB ram, 4000 mah బ్యాటరీ తో కూల్ ప్యాడ్ & LeEco కలిసి స్మార్ట్ ఫోన్ లాంచ్

ఇండియాలో 4GB ram, 4000 mah బ్యాటరీ తో కూల్ ప్యాడ్ & LeEco కలిసి స్మార్ట్ ఫోన్ లాంచ్

Coolpad నుండి ఇండియాలో ఈ రోజు లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ రిలీజ్ అయ్యింది. పేరు Cool 1 dual. ఇది Coolpad మరియు LeEco కలిసి తయారుచేసిన మొదటి స్మార్ట్ ఫోన్. 

రెండు వేరియంట్స్ లో వస్తుంది. ఒకటి 3GB రామ్/32GB స్టోరేజ్. రెండవ వేరియంట్ – 4GB రామ్ అండ్ 32GB స్టోరేజ్. రెండు వేరియంట్స్ ఒకే ప్రైస్ తో వస్తున్నాయి – 13,999 రూ.

స్పెక్స్ – డ్యూయల్ సిమ్, 4G VoLTE సపోర్ట్, 5.5 in FHD 403PPi అండ్ 450 nits బ్రైట్ నెస్ డిస్ప్లే, స్నాప్ డ్రాగన్ 652 ఆక్టో కోర్ 64 బిట్ ప్రొసెసర్, అడ్రెనో 510 GPU.

డ్యూయల్ రేర్ కెమెరా సెట్ అప్ – అంటే వెనుక రెండు 13MP కేమేరాస్ డ్యూయల్ tone led ఫ్లాష్ సపోర్ట్ కలిగి ఉన్నాయి. ఒకటి depth, డీటెయిల్, బ్రైట్ నెస్ బాగా తీస్తే మరొకటి కలర్ చూసుకుంటుంది.

ఫ్రంట్ 8MP కెమెరా, 4000 mah బ్యాటరీ, ఫింగర్ ప్రింట్ స్కానర్, ఆండ్రాయిడ్ 6.0 based EUI 5.6 OS, బ్లూ టూత్ 4.1, infrared, USB టైప్ C పోర్ట్ తో ఫోన్ బరువు 173 గ్రా ఉంది.

అమెజాన్ లో మాత్రమే జనవరి 5 నుండి ఫోన్ సేల్స్ ప్రారంభం అవుతాయి. 3GB రామ్ వేరియంట్ మాత్రం కేవలం ఆఫ్ లైన్ సేల్స్ లోనే దొరుకుతుంది. ఆఫ్ లైన్ సేల్స్ డేట్స్ త్వరలోనే చెప్పనుంది కంపెని.

ఇదే ఫోన్ చైనా లో ఆల్రెడీ ముందే రిలీజ్ అయ్యింది. అక్కడ మోడల్ లో ఫోన్ పై Cool అని బ్రాండ్ naming ఉంటే, ఇండియన్ ఫోన్లపై Coolpad అని ఉంది.

Coolpad Cool 1 అమెజాన్ లో 13,999 లకు కొనండి

Team Digit

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo