పూర్తి స్పెక్స్ సరిపోలిక : శామ్సంగ్ గెలాక్సీ S10E vs ఆపిల్ ఐఫోన్ XR

Updated on 22-Feb-2019
HIGHLIGHTS

ఈ రెండు ఫోన్లు కూడా, ప్రీమియం సెగ్మెంట్లో వచ్చిన బడ్జెట్ ఫోన్లు కాబట్టి, ఈ రెండు స్మార్ట్ ఫోన్లను సరిపోల్చి చూద్దాం.

శామ్సంగ్ చివరకు తన గెలాక్సీ S10 స్మార్ట్ ఫోన్ల లైనప్ ని  ప్రకటించింది. గెలాక్సీ S10 సిరీసులో, శామ్సంగ్ గెలాక్సీ S10, గెలాక్సీ S10E మరియు గెలాక్సీ S10+  మూడు ఫోన్లు ఉన్నాయి. స్పెక్స్, ఫీచర్స్ మరియు పలు రకాల కలర్ వేరియంట్లతో, గెలాక్సీ S10e విడుదలైనది, ఇది నేరుగా ఆపిల్ ఐఫోన్ XR తో పోటీపడే ఒక పోటీదారుగా చెప్పవచ్చు . ఈ రెండు ఫోన్లు కూడా, ప్రీమియం సెగ్మెంట్లో వచ్చిన బడ్జెట్ ఫోన్లు కాబట్టి, ఈ రెండు స్మార్ట్ ఫోన్లను సరిపోల్చి చూద్దాం.    

డిస్ప్లే మరియు డిజైన్

ఈ రెండు ఫోన్ల డిస్ప్లే మరియు డిజైన్లను పరిశీలిద్దాం. కొత్తగా ప్రకటించిన ఈ శామ్సంగ్ గెలాక్సీ S10e, ఇన్ఫినిటీ- O డిస్ప్లే రూపకల్పనను మరియు ముందు కెమెరా  డిస్ప్లేలో ఒక పంచ్ హోల్ ను పరిచయం చేయడం ద్వారా నోచ్ ను తొలగించారు. అయితే, అది ఒక ఫ్లాట్ డిస్ప్లేతో వస్తుంది, కర్వ్డ్ ఇన్ఫినిటీ డిస్ప్లే కోసం మనము గెలాక్సీ S10, మరియు S10+ హ్యాండ్సెట్ నుండి పొందవచ్చు. మరోవైపు, ఐఫోన్ XR యొక్క రూపకల్పన ఐఫోన్ X / XS కు సమానంగా ఉంటుంది, ఇది ఫేస్ ఐడి సాంకేతికతను అందిస్తుంది, ఈ రకమైన నోచ్ డిస్ప్లే ప్రస్తుతం ప్రముఖంగా అన్నిఫోనులలో ఉంటుంది. నోచ్ ను ఇష్టపడని వారు ఇన్ఫినిటీ- O డిస్ప్లే డిజైన్ తో వుండే గెలాక్సీ S10 లో ఆకర్షణీయంగా ఉంటుంది.

ఆన్ పేపర్ , శామ్సంగ్ గెలాక్సీ S10e యొక్క డిస్ప్లే స్పెసిఫికేషన్స్ ఉత్తమంగా కనిపిస్తాయి. ఇది ఒక 1080 x 2280 పిక్సెల్ రిసల్యూషనుతో ఒక 5.8 అంగుళాల డైనమిక్ AMOLED డిస్ప్లేను కలిగి ఉంది. మరోవైపు, ఐఫోన్ XR 1792 x 828 పిక్సెళ్లను అందించే  ఒక 6.1 అంగుళాల లిక్విడ్ రెటినా HD LCD డిస్ప్లేతో లభిస్తుంది. ఐఫోన్ XR యొక్క డిస్ప్లే పరిమాణాన్ని పెంచడానికి ఈ ఫోను యొక్క డిస్ప్లే రిజల్యూషన్ను తగ్గించాలని సంస్థ నిర్ణయం తీసుకుంది. అదనంగా, ఇది ఐఫోన్ 8 ప్లస్ కంటే ఎక్కువ ధరతో విడుదల చేసింది మరియు ఇది పూర్తి HD డిస్ప్లే కూడా కాదు.

పర్ఫార్మెన్స్ 

ఐఫోన్ XR స్మార్ట్ ఫోన్ 7nm ఫ్యాబ్రికేషన్ ప్రక్రియ ద్వారా తయారు చేయబడిన సంస్థ యొక్క సొంత A12 బయోనిక్ చిప్ ను కలిగి ఉంది మరియు ఇది అన్ని Android ఫ్లాగ్షిప్ల కంటే ఉత్తమంగా ఉండేలా అందించబడింది, ఇది దాని పాత సిబ్లింగ్స్ అయిన, ఐఫోన్ XS మరియు ఐఫోన్ XS మాక్స్ తో పాటుగా సరితూగుతుంది. మేము AnTuTu  మరియు గీక్బెంచ్ రెండింటిలోనూ ఈ పరికరాన్ని బెంచ్మార్క్ చేసినప్పుడు ఇది నిజమని తేలింది.

మేము శామ్సంగ్ గెలాక్సీ S10e రివ్యూ చేయబోతున్నప్పటికీ, ఈ ఫోన్ యొక్క వెల్లడించిన Geekbench స్కోర్లు 10,000 గుర్తును కూడా తాక లేదు. భారతదేశం లో, ఈ హ్యాండ్సెట్ సంస్థ యొక్క Exynos 9820 SoC తో ప్రారంభించబడుతుంది, ఇది ఒక 8nm ఫ్యాబ్రికేషన్ ప్రక్రియ ఉపయోగించి తయారు చేస్తారు. ఈ చిప్సెట్ దాని ప్రత్యర్థి కంటే 1nm తక్కువగా ఉంటుంది మరియు ఇది కొంచెం ప్రతికూలంగా ఉండవచ్చు. ఇక Antutu నుండి బహిర్గతమైన మరొక బెంచ్మార్క్ లిస్టింగ్ A12 బయోనిక్ వంటి ఇదే స్థాయిలో ఉన్న పనిని ఈ చిప్ చేయడం కోసం కంపెనీ ఈ చిప్ ను సవరింనట్లు సూచిస్తుంది. అయినప్పటికీ, S10E  ను Exynos 9820 SoC ని పరీక్షించటానికి ఇంకా మేము మా తీర్పులను రిజర్వ్ చేస్తాము.

కెమెరా

శామ్సంగ్ గెలాక్సీ S10e డ్యూయల్ ప్రధాన షూటర్లను కలిగి ఉంటుంది, ఇక ఐఫోన్ XR ఒకే కెమెరాతో అమర్చబడి ఉంటుంది. ఐఫోన్ XR F / 1.8 ఎపర్చరుతో మరియు 12MP వైడ్ -యాంగిల్ వెనుక కెమెరాను కలిగి ఉంటుంది, ఇది F / 2.2 తో 7MP సెన్సార్నుముందుభాగంలో  కలిగి ఉంది. ఈ  "ఐఫోన్ XR అద్భుత చిత్రాలను తీస్తుంది, కానీ డ్యూయల్  కెమెరా లేకపోవడం ఖచ్చితంగా ఇది వెనుకబడుతుంది , ముఖ్యంగా XR గత సంవత్సరం ఐఫోన్ 8 ప్లస్ లో వుండే అదే ధరను కలిగి ఉంది. మీరు ద్వితీయ లెన్స్ కోరుకుంటే, మీకు ఖరీదైన ఐఫోన్ XS కోసం వెళ్ళవలసి ఉంటుంది. "

శామ్సంగ్ గెలాక్సీ S10e ఫోన్ వెనుక భాగంలో F / 1.5 మరియు /F/2.4 మధ్య ఒక వేరియబుల్ ఎపర్చరు కలిగి ఉన్న 12 MP ప్రధాన వైడ్ యాంగిల్ కెమెరాతో వస్తుంది. ముందు అది F / 2.2 ఎపర్చరుతో 16 MP అల్ట్రా వైడ్ షూటర్ కలిగి ఉంటుంది. శామ్సంగ్ ఈ ఫోన్ లాంచ్ సమయంలో చూపించిన కెమెరా శాంపిల్స్  మరియు కెమెరా నమూనాలు దృఢంగా కనిపిస్తాయి, అయితే మా కెమెరా పరీక్షల ద్వారా హ్యాండ్సెట్ను ఎలా ఉపయోగించాలో వారు ఎలా అందించారు అనే దానిపై మేము ఒక తీర్పును ఇస్తాము.

మెమరీ మరియు స్టోరేజి

మేము శామ్సంగ్ గెలాక్సీ S10e మరియు ఐఫోన్ XR మధ్య మెమరీ పోలిక చూసినట్లయితే చాల తేడా ఉంటుంది. ఐఫోన్ XR లో ఉన్న iOS 3G RAM తో అమర్చినప్పటికీ, దాదాపు అన్ని పనుల్లో ఇది దోషపూరితంగా పనిచేస్తుంది. Android ఫోన్లు ఎక్కువగా వాడినపుడు వేగం తగ్గుతుందని మనకు తెలుసు, అయితే గెలాక్సీ S10e 6GB మరియు 8GB RAM రకాల్లో లభిస్తుంది. ఈ మొత్తం మెమరీ చాలా ఇంటెన్సివ్ పనులు కోసం సరిపోతుంది.  ఐఫోన్ XR iOS 12 లో నడుస్తుంది, గెలాక్సీ S10e ఒక UI పై నడుస్తుంది, ఇది Android 9 Pie పైన ఆధారపడి ఉంటుంది.

స్టోరేజ్ పరంగా, శామ్సంగ్ గెలాక్సీ S10e దాని కేసుని కలిగి ఉంది, ఎందుకంటే దాని బేస్ వేరియంట్లో 128GB అంతర్గత స్టోరేజితో వస్తుంది, 256GB అధిక మెమొరీ ఎంపిక కూడా వుంది. మరోవైపు, ఐఫోన్ XR సాధారణ వేరియంట్  స్టోరేజి 64GB, అయితే 128GB మరియు 256GB వంటి అధిక ఎంపికలు కూడా అందుబాటులో ఉంటాయి. ఇక, ముఖ్యమైన విషయం ఏమిటంటే గెలాక్సీ S10e లో 512GB వరకు స్టోరేజి సామర్ధాయాన్ని పెంచుకోవచ్చు.

శామ్సంగ్ తన భారతదేశంలో శామ్సంగ్ గెలాక్సీ S10e యొక్కధర ఇంకా ప్రకటించలేదు, కానీ  ఇంకా US లో, ఇది $ 749 (రూపాయలు 53,250 సుమారు) ధర వద్ద ప్రారంభమవుతుంది. అదనంగా, ఆపిల్ ఐఫోన్ XR యొక్క బేస్ వేరియంట్ రూ. 76,900 ధరతో విక్రయిస్తుంది. S10e ఇండియా ధర ఇంకా నిర్ణయించలేదు, కానీ  ఇక్కడ కన్వర్టెడ్ ధర చుస్తే మాత్రం, ఇది ఐఫోన్ XR కంటే తక్కువగా ఉంటుంది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :