CMF Phone 2: నెట్టింట్లో హల్ చల్ చేస్తున్న నథింగ్ సబ్ బ్రాండ్ ఫోన్ లీక్స్.!

CMF అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ లాంచ్ గురించి కొత్త సంగతులు ఇప్పుడు నెట్టింట్లో హల్ చల్ చేస్తున్నాయి
Pokemon ఫోటోలతో టీజింగ్ మొదలు పెట్టినప్పటి నుంచి ఈ ఫోన్ గురించి చర్చ మొదలయ్యింది
ఈ అప్ కమింగ్ ఫోన్ గురించి మీరు తెలుసుకోవాల్సిన అన్ని విషయాలు ఇక్కడ ఉన్నాయి
CMF Phone 2: నథింగ్ సబ్ బ్రాండ్ CMF అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ లాంచ్ గురించి కొత్త సంగతులు ఇప్పుడు నెట్టింట్లో హల్ చల్ చేస్తున్నాయి. బడ్జెట్ ధరలో ఆకట్టుకునే ఫీచర్స్ తో మార్కెట్ లో భారీ అమ్మకాలను సిఎంఎఫ్ ఫోన్ 1 సాధించింది. ఈ ఫోన్ యొక్క తరువాతి తరం ఫోన్ ఎలా ఉంటుంది మరియు ఈ ఫోన్ ఫీచర్స్ ఏమై ఉండవచ్చు అనే ఊహ చాలా మందికి కలుగుతుంది. రీసెంట్ గా కంపెనీ X అకౌంట్ నుంచి Pokemon ఫోటోలతో టీజింగ్ మొదలు పెట్టినప్పటి నుంచి ఈ ఫోన్ గురించి చర్చ మొదలయ్యింది. అయితే, కంపెనీ ఈ ఫోన్ లాంచ్ గురించి పూర్తిగా అనౌన్స్ చేయడానికి ముందే నెట్టింట్లో ఈ ఫోన్ అంచనా మరియు లీక్ వివరాలు ప్రత్యక్షమయ్యాయి.
మీరు నథింగ్ మరియు CMF ఫోన్ లకు ఫ్యాన్స్ అయితే ఈ అప్ కమింగ్ ఫోన్ గురించి మీరు తెలుసుకోవాల్సిన అన్ని విషయాలు ఇక్కడ ఉన్నాయి.
CMF Phone 2: ఎప్పుడు లాంచ్ అవుతుంది?
ఈ ఫోన్ లాంచ్ వివరాలు కంపెనీ ఇంకా ప్రకటించలేదు. అయితే, ఈ ఫోన్ ఏప్రిల్ నెలలో లాంచ్ అయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఫోన్ వివరాలు ముందే లీక్ చేసే టిప్స్టర్ అంచనా వేసి చెబుతున్న డేట్ ఇది.
CMF Phone 2: అంచనా ఫీచర్స్
సిఎంఎఫ్ ఫోన్ 2 స్మార్ట్ ఫోన్ అంచనా స్పెక్స్ మరియు ఫీచర్లు ఇప్పుడు నెట్టింట్లో ఎక్కువగా వినిపిస్తున్న మాట. అందుకే, ఈ స్మార్ట్ ఫోన్ యొక్క ఫీచర్లు ఇప్పుడు చర్చిద్దాం. ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ 6.3 ఇంచ్ AMOLED స్క్రీన్ తో వచ్చే అవకాశం ఉంటుంది. ఈ స్క్రీన్ 120Hz రిఫ్రెష్ రేట్, HDR 10+ సపోర్ట్ మరియు 2500 నిట్స్ పీక్ బ్రైట్నెస్ కలిగి ఉండవచ్చు. ఈ ఫోన్ మీడియాటెక్ లేటెస్ట్ బడ్జెట్ చిప్ సెట్ Dimensity 7400 తో లాంచ్ అయ్యే అవకాశం వుంది. ఈ ఫోన్ లో 8GB ర్యామ్ మరియు 256GB ఇంటర్నల్ స్టోరేజ్ లు జతగా ఉండవచ్చు.
ఈ నథింగ్ సబ్ బ్రాండ్ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ లో వెనుక 50MP మెయిన్ + 8Mp అల్ట్రా వైడ్ సెన్సార్ కలిగిన డ్యూయల్ రియర్ కెమెరా మరియు ముందు 16MP సెల్ఫీ కెమెరా ఉంటాయి. ఈ ఫోన్ 5000 mAh బ్యాటరీ మరియు 50W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ ను కలిగి ఉంటుంది. ఈ సిఎంఎఫ్ ఫోన్ 2 ఆండ్రాయిడ్ 15 OS పై నథింగ్ OS 3.1 సాఫ్ట్ వేర్ తో లాంచ్ కావచ్చని అంచనా వేస్తున్నారు.
Also Read: LG OLED Smart Tv పై రూ. 15,000 భారీ డిస్కౌంట్ అందుకోండి.!
సిఎంఎఫ్ ఫోన్ 2 : అంచనా ప్రైస్
టిప్స్టర్ ప్రకారం, ఈ ఫోన్ రూ. 17,999 రూపాయల ప్రారంభ ధరతో వచ్చే అవకాశం ఉంటుందని అంచనా. అయితే, ఈ ఫోన్ హై ఎండ్ వేరియంట్ రూ. 19,999 ధరతో వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
పైన తెలిపిన ధర మరియు ఫీచర్లు అన్ని కూడా రూమర్లు మరియు అంచనా వేసి చెబుతున్న వివరాలు మాత్రమే అని గమనించాలి. ఈ ఫోన్ గురించి నథింగ్ ఇంకా ఎటువంటి ప్రకటన చేయలేదు.
నోట్: మెయిన్ ఇమేజ్ CMF Phone 1 యొక్క ఇమేజ్