CMF Phone 2 Pro: ఆన్ లైన్ లో లీకైన అప్ కమింగ్ ఫోన్ ప్రైస్ వివరాలు.!
CMF Phone 2 Pro స్మార్ట్ ఫోన్ వచ్చే వారం ప్రారంభంలో లాంచ్ అవుతుంది
సిఎంఎఫ్ ఫోన్ 2 ప్రో ప్రైస్ వివరాలు ఆన్లైన్ లో లీక్ అయ్యాయి
ఈ ఫోన్ బడ్జెట్ ధరలో లాంచ్ అయ్యే అవకాశం ఉందని ఈ కొత్త లీక్స్ చెబుతున్నాయి
CMF Phone 2 Pro స్మార్ట్ ఫోన్ వచ్చే వారం ప్రారంభంలో లాంచ్ అవ్వనుండగా, ఈ ఫోన్ ప్రైస్ వివరాలు ఆన్లైన్ లో లీక్ అయ్యాయి. ఈ ఫోన్ బడ్జెట్ ధరలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది, అని ఈ కొత్త లీక్స్ చెబుతున్నాయి. ఈ ఫోన్ యొక్క కీలకమైన ఫీచర్స్ తో టీజింగ్ చేస్తున్న CMF, ఈ ఫోన్ ను ఆకట్టుకునే ఫీచర్స్ తో లాంచ్ చేస్తున్నట్లు గొప్పగా చెబుతోంది. ఈ రెండు మ్యాటర్స్ ను కలిపి చూస్తే ఈ సి ఎంఎఫ్ అప్ కమింగ్ ఫోన్ బడ్జెట్ ధరలో ఆకట్టుకునే ఫీచర్స్ తో లాంచ్ అవుతుందని చెబుతున్నాయి.
SurveyCMF Phone 2 Pro : లీక్ ప్రైస్
సిఎంఎఫ్ ఫోన్ 2 ప్రో స్మార్ట్ ఫోన్ ప్రైస్ గురించి ప్రముఖ టిప్స్టర్ యోగేష్ బ్రార్ తన X అకౌంట్ (గతంలో ట్విట్టర్) ను వివరాలు షేర్ చేశారు. అంతేకాదు మరికొంత మంది టిప్ స్టర్స్ కూడా ఇదే విషయాన్ని వారి అకౌంట్ ను వెల్లడించారు. ఈ ఆన్లైన్ లీక్స్ ద్వారా సిఎంఎఫ్ ఫోన్ 2 ప్రో స్మార్ట్ ఫోన్ బేసి (8GB + 128GB) వేరియంట్ ను రూ. 18,999 ధరతో లాంచ్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. అంతేకాదు,
అంతేకాదు, ఈ స్మార్ట్ ఫోన్ రెండవ (8GB + 256GB) వేరియంట్ ను రూ. 18,999 ధరతో లాంచ్ చేయవచ్చని కోడోత్ అంచనా వేసి చెబుతున్నారు. వాస్తవానికి, నథింగ్ ముందుగా విడుదల చేసిన సిఎంఎఫ్ ఫోన్ 1 స్మార్ట్ ఫోన్ లాంచ్ ప్రైస్ తో పోలిస్తే ఎక్కువ అవుతుంది. అయితే, ఈ ఫోన్ ఫీచర్స్ పరంగా ఆకట్టుకుంటుందని కూడా చెబుతున్నారు. అయితే, కంపెనీ నుంచి ప్రస్తుతానికి ఎటువంటి అఫీషియల్ అనౌన్స్ మెంట్ రాలేదు. ఇవి కేవలం అంచనా లేదా లీక్ ప్రైస్ గా మాత్రమే చూడాలి.
CMF Phone 2 Pro : ఫీచర్స్
సిఎంఎఫ్ ఫోన్ 2 ప్రో స్మార్ట్ ఫోన్ యొక్క చాలా కీలకమైన ఫీచర్స్ కంపెనీ ఇప్పటికే వెల్లడించింది. ఈ స్మార్ట్ ఫోన్ ను మీడియాటెక్ Dimensity 7300 Pro చిప్ సెట్ తో లాంచ్ చేస్తోంది. ఈ ఫోన్ 120FPS BGMI గేమింగ్ సపోర్ట్, 53+ నెట్ వర్క్ బూస్టింగ్ మరియు 1000 Hz టచ్ శాంప్లింగ్ రేట్ సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ అల్ట్రా స్లిమ్ మరియు అల్ట్రా లైట్ డిజైన్ తో ఉంటుందని కూడా నథింగ్ తెలిపింది. ఈ స్మార్ట్ ఫోన్ సరికొత్త డ్యూయల్ ఎలివేటెడ్ ఫినిష్ కలర్ డిజైన్ తో వస్తుంది.

ఈ ఫోన్ కెమెరా పరంగా గొప్ప అప్గ్రేడ్ తో వస్తుంది. ఈ ఫోన్ లో ట్రిపుల్ రియర్ కెమెరా అందించింది. ముఖ్యంగా ఈ ఫోన్ లో 50MP టెలిఫోటో అందించడం మెయిన్ అప్గ్రేడ్. అంతేకాదు, CMF ఫోన్ 1 తో పోలిస్తే కెమెరా మోడ్యూల్ ను కూడా అప్గ్రేడ్ చేసింది. దీనికి జతగా 50MP మెయిన్ కెమెరా మరియు 8MP అల్ట్రా వైడ్ కెమెరా కూడా ఉన్నాయి.
Also Read: ఆకట్టుకునే ఫీచర్స్ తో వచ్చే బెస్ట్ Earbuds అండర్ రూ. 2,000 డీల్స్ ఇవిగో.!
సిఎంఎఫ్ ఫోన్ 2 ప్రో స్మార్ట్ ఫోన్ ఏప్రిల్ 28 వ తేదీ సాయంత్రం 6 గంటల 30 నిముషాలకు ఇండియన్ మార్కెట్లో లాంచ్ అవుతుంది.