digit zero1 awards

ఆన్లైన్ లో లీకైన CMF Phone 1 ఫీచర్స్ మరియు ప్రైస్..!

ఆన్లైన్ లో లీకైన CMF Phone 1 ఫీచర్స్ మరియు ప్రైస్..!
HIGHLIGHTS

CMF Phone 1 స్మార్ ఫోన్ ను విడుదల చేయనున్నట్లు కంపెనీ కన్ఫర్మ్ చేసింది

గత వారం నుండి టీజింగ్ క్యాంపైన్ ను కూడా స్టార్ట్ చేసింది

ఈ ఫోన్ ఫీచర్స్ మరియు అంచనా ధర వివరాలను సైతం నెట్టింట్లో లీక్ చేశారు

Nothing సబ్ బ్రాండ్ CMF నుండి CMF Phone 1 స్మార్ ఫోన్ ను విడుదల చేయనున్నట్లు కంపెనీ కన్ఫర్మ్ చేసింది. ఈ ఫోన్ లాంచ్ కోసం గత వారం నుండి టీజింగ్ క్యాంపైన్ ను కూడా స్టార్ట్ చేసింది. అయితే, లీక్ స్టర్స్ కంపెనీ కంటే నాలుగడుగులు ముందు ఉన్నారు. ఎందుకంటే, ఈ ఫోన్ లాంచ్ డేట్ కన్ఫర్మ్  ను కూడా కంపెనీ ప్రకటించక ముందే ఈ ఫోన్ ఫీచర్స్ మరియు అంచనా ధర వివరాలను సైతం నెట్టింట్లో లీక్ చేశారు.

CMF Phone 1 ఎప్పుడు లాంచ్ అవుతుంది?

సిఎంఫ్ ఫోన్ 1 అఫీషియల్ లాంచ్ డేట్ ను ఇప్పటికీ కంపెనీ వెల్లడించ లేదు. ‘Coming Soon’ ట్యాగ్ లైన్ తోనే కంపెనీ ఈ ఫోన్ గురించి ఆటపట్టిస్తోంది. అయితే, ఈ ఫోన్ ఈ నెల చివరి నాటికి మార్కెట్లో విడుదల కావచ్చని లీక్ స్టర్స్ చెబుతున్నారు. ఈ ఫోన్ స్పెక్స్ మరియు ఫీచర్స్ ను సైతం లీక్ స్టర్స్ నెట్టింట్లో వెల్లడించారు.  

నెట్టింట్లో లీకైన CMF ఫోన్ 1 ఫీచర్స్ ఏమిటి?

ఆన్లైన్ లీక్స్ నుండి ఈ ఫోన్ డిజైన్ మరియు వివరాలు బయటకు వచ్చాయి. ఈ ఫోన్ 6.7 ఇంచ్ AMOELD డిస్ప్లే వస్తుందని లీక్స్ చెబుతున్నాయి. ఈ డిస్ప్లే FHD+ రిజల్యూషన్, 120Hz రేట్ మరియు ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో ఉంటుందని కూడా చెబుతున్నారు. ఈ ఫోన్ Dimesity 7300 5జి చిప్ సెట్ తో వస్తుందని కూడా వెల్లడించారు.

CMF Phone 1
CMF Phone 1

సిఎంఫ్ ఫోన్ 1 కెమెరా వివరాలు కూడా ఆన్లైన్ లో లీకయ్యాయి. ఈ ఫోన్ 50MP డ్యూయల్ రియర్ కెమెరా మరియు 16MP సెల్ఫీ కెమెరా కలిగి ఉంటుందని లీక్ స్టర్స్ చెబుతున్నారు. ఈ ఫోన్ లేటెస్ట్ నథింగ్ OS సాఫ్ట్ వేర్ తో Android 14 OS పైన నడుస్తుందని హింట్ ఇస్తున్నారు. ముందే చెప్పినట్లు, ఈ ఫోన్ డిజైన్ ను వివరిస్తూ ఇమేజ్ లను కూడా ఆన్లైన్ లో పోస్ట్ చేస్తున్నారు. అంతేకాదు, ఈ ఫోన్ 20 వేల రూపాయల ఉప బడ్జెట్ లో లాంచ్ చేయవచ్చని అంచనా వేసి చెబుతున్నారు.

Also Read: 108MP కెమెరా మరియు 33W ఫాస్ట్ ఛార్జ్ తో Poco M6 ను పోకో లాంచ్ చేస్తోంది.!

ఇవన్నీ కూడా ఆన్లైన్ లీకైన అంచనా ఫీచర్స్ గా చూడవచ్చు. అయితే, ఈ ఫోన్ లాంచ్ లేదా ఫీచర్స్ లేదా డిజైన్ గురించి కంపెనీ ఇప్పటివరకు ఎటువంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ చెయ్యలేదు. కాబట్టి, ఇవన్నీ కూడా ఎక్స్పెక్టడ్ లేదా అంచనా ఫీచర్స్ గా ఊహిస్తున్నారు.

Image: ఆన్లైన్ రెండర్ ఇమేజ్

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo