CMF Phone 1 కీలకమైన ఫీచర్స్ అనౌన్స్.. 16GB ర్యామ్ తో వస్తోంది.!

Updated on 01-Jul-2024
HIGHLIGHTS

CMF Phone 1 కీలకమైన ఫీచర్ లతో కొత్త టీజర్ లను విడుదల చేసింది

బడ్జెట్ స్మార్ట్ ఫోన్ లను తెచ్చే పనిలో పడింది నథింగ్

ఈ ఫోన్ కీలకమైన ఫీచర్లతో కొత్త టీజర్ లను కూడా విడుదల చేసింది

CMF Phone 1 కీలకమైన ఫీచర్ లతో కంపెనీ కొత్త టీజర్ లను విడుదల చేసింది. నథింగ్ సబ్ బ్రాండ్ అయిన ఈ కంపెనీ నుంచి బడ్జెట్ స్మార్ట్ ఫోన్ లను తెచ్చే పనిలో పడింది నథింగ్. అందుకే, ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ గురించి చాలా కాలంగా భారీగా టీజింగ్ చేస్తోంది. అంతేకాదు, ఈ ఫోన్ పైన మరింత హైప్ ను క్రియేట్ చేసేలా ఈ ఫోన్ కీలకమైన ఫీచర్లతో కొత్త టీజర్ లను కూడా విడుదల చేసింది.

CMF Phone 1: ఫీచర్లు

సిఎంఎఫ్ ఫోన్ 1 ఫోన్ ను జూలై 8 వ తేదీ మధ్యాహ్నం 2:30 గంటలకు ఇండియాలో లాంచ్ చేస్తోంది. ఈ ఫోన్ ను వినూత్నమైన డిజైన్ తో తీసుకొస్తున్నట్లు కంపెనీ తెలిపింది. ఈ ఫోన్ లో వెనక రౌండ్ సర్క్యులర్ నాబ్ మరియు డిటాచబుల్ స్క్రూ ఉన్నట్లు చూపించింది. ఈ రెండు విషయాలు కూడా మార్కెట్ లో ప్రస్తుతం లభిస్తున్న ఇతర ఫోన్ ల నుండి ఈ ఫోన్ ను వేరు చేసే విషయాలుగా ఉంటాయి.

CMF Phone 1 16GB RAM

Flipkart ఈ సిఎంఎఫ్ ఫోన్ కోసం కొత్తగా అందించిన టీజర్ ఇమేజ్ ద్వారా, ఈ ఫోన్ Dimensity 7300 చిప్ సెట్ తో పని చేస్తుందని తెలిపింది. ఇది 4nm క్లాస్ ప్రోసెసర్ మరియు Arm Mali‑G615 GPU తో వస్తుంది. ఈ చిప్ సెట్ కనెక్టివిటీ పరంగా Wi‑Fi 6E మరియు Bluetooth 5.4 సపోర్ట్ తో ఉంటుంది. ఇది మాత్రమే కాదు, 4K HDR వీడియో షూట్ చేయగలిగే సత్తా మరియు మంచి డిస్ప్లే సపోర్ట్ ను కూడా అందిస్తుంది.

Also Read: Jio Plans: ఎల్లుండి నుంచి ఈ రెండు జబర్దస్త్ ప్రీపెయిడ్ ప్లాన్లు ఇక ఉండవు.!

ఈ చిప్ సెట్ కి జతగా ఈ ఫోన్ లో 8GB ర్యామ్ మరియు 8GB ర్యామ్ బూస్టర్ ఫీచర్ తో టోటల్ 16GB ర్యామ్ ఫీచర్ తో వస్తుందని కూడా కంపెనీ తెలిపింది. ఈ ఫోన్ లో అందించిన మరొక ఫీచర్ ను కూడా కంపెనీ తెలిపింది. ఈ ఫోన్ చాలా గొప్ప రిజల్యూషన్ మరియు కలర్స్ అందించగల Super AMOLED డిస్ప్లే ఉన్నట్లు కంపెనీ తెలిపింది.

ఈ ఫోన్ లాంచ్ నాటికి ఈ ఫోన్ యొక్క చాలా కీలకమైన స్పెక్స్ మరియు ఫీచర్లను కంపెనీ వెల్లడించే అవకాశం ఉండవచ్చు. అయితే, ఇప్పటికే చాలా మంది లీక్ స్టర్స్ ఈ ఫోన్ స్పెక్స్ ను అంచనా వేసి చెబుతున్నారు. కానీ, కంపెనీ అధికారికంగా అనౌన్స్ చేసే వరకూ ఇవన్నీ కూడా అంచనా ఫీచర్లు గానే పరిగణించబడతాయి.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :