CMF Phone 1 5G: నథింగ్ సబ్ బ్రాండ్ సిఎంఎఫ్ చాలా కాలంగా ఊరిస్తూ వచ్చిన సిఎంఎఫ్ ఫోన్ 1 ను ఎట్టకేలకు ఈరోజు ఇండియాలో విడుదల చేసింది. ముందుగా ఊహించిన విధంగా ఈ స్మార్ట్ ఫోన్ ను బడ్జెట్ యూజర్లను ఆకట్టుకునే ధరలో విడుదల చేసింది. ఈ ఫోన్ బడ్జెట్ రేటులో 4K కెమెరా మరియు ఫాస్ట్ ప్రోసెసర్ తో వచ్చింది.
సిఎంఎఫ్ ఫోన్ 1 స్మార్ట్ ఫోన్ బేసిక్ వేరియంట్ (6GB + 128GB) ను రూ. 15,999 ధరతో విడుదల చేసింది. ఈ ఫోన్ యొక్క హై ఎండ్ వేరియంట్ (8GB + 128GB) ను రూ. 17,999 ధరతో లాంచ్ చేసింది. ఈ ఫోన్ పై మంచి బ్యాంక్ ఆఫర్లు కూడా సిఎంఎఫ్ అందించింది.
Axis, HDFC మరియు OneCard క్రెడిట్ కార్డ్స్ మరియు EMI ఆప్షన్ తో ఈ ఫోన్ కొనే వారికి రూ. 1,000 డిస్కౌంట్ ఆఫర్ ను సిఎంఎఫ్ అందించింది. జూలై 12వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుండి ఈ ఫోన్ ఫస్ట్ సేల్ మొదలవుతుంది. ఈ ఫోన్ Flipkart నుండి సేల్ కి అందుబాటులోకి వస్తుంది.
Also Read: Social Media అడ్డాగా కొత్తగా ట్రేడింగ్ స్కామ్ ఊపందుకుంది..జర భద్రం భయ్యా.!
సిఎంఎఫ్ ఫోన్ 1 స్మార్ట్ ఫోన్ ను సరికొత్త డిజైన్ తో అందించింది. ఈ ఫోన్ బ్యాక్ కవర్ ను ఎప్పుడంటే అప్పుడు మార్చుకునేలా ఈ ఫోన్ ను డిజైన్ చేయబడింది. ఈ ఫోన్ లో వెనుక ఉన్న రౌండ్ కీ సెటప్ తో ఫోన్ ను మేడలో వేసుకునేలా మరియు వీడియోలు చూసేప్పుడు హోల్డర్ గా కూడా ఏర్పాటు చేసుకునే వీలుంది.
ఈ ఫోన్ లో HDR 10+ సపోర్ట్, 120Hz రిఫ్రెష్ రేట్ మరియు 200 నిట్స్ పీక్ బ్రైట్నెస్ కలిగిన 6. 67 ఇంచ్ సూపర్ AMOLED డిస్ప్లే వుంది. ఈ ఫోన్ ను మీడియాటెక్ యొక్క లేటెస్ట్ ఫాస్ట్ ప్రోసెసర్ Dimensity 7300 5G తో అందించింది. ఇది గరిష్టంగా 6,70,000 కంటే పైచిలుకు AnTuTu స్కోర్ అందించే సత్తా కలిగివుంది. దానికి జతగా 8GB ఫిజికల్ ర్యామ్ మరియు 8GB ర్యామ్ బూస్టర్ సపోర్ట్ తో వస్తుంది. అలాగే, ఈ ఫోన్ లో 128GB ఇంటర్నల్ స్టోరేజ్ తో పాటు మైక్రో SD కార్డ్ ద్వారా 2TB వరకు స్టోరేజ్ ను పెంచుకోవచ్చు.
ఇక ఆప్టిక్స్ పరంగా, ఈ ఫోన్ లో వెనుక డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ వుంది. ఈ సెటప్ లో 50MP Sony మెయిన్ కెమెరా మరియు 2MP పోర్ట్రైట్ కెమెరా ఉన్నాయి. ఈ కెమెరాతో 30 fps వద్ద 4K వీడియోలను షూట్ చేయవచ్చు మరియు TRUELENS ENGINE 2.0 సపోర్ట్ గొప్ప ఫోటోలు మరియు వీడియోలు పొందవచ్చని చెబుతున్నారు. అలాగే, ఈ ఫోన్ లో ముందు 16MP సెల్ఫీ కెమెరా కూడా వుంది.
ఈ ఫోన్ Nothing OS 2.6 సాఫ్ట్ వేర్ పైన Android 14 OS తో పని చేస్తుంది. ఈ ఫోన్ లో 33W ఫాస్ట్ ఛార్జ్ మరియు 5W రివర్స్ ఛార్జ్ సపోర్ట్ కలిగిన 5000mAh బ్యాటరీ వుంది.