Nextbit US based కంపెని Robin స్మార్ట్ ఫోన్ ను ఇండియాలో లాంచ్ చేసింది ఈ రోజు. ఈ ఫోన్ లో ముఖ్యంగా రెండు హై లైట్స్. ఒకటి లుక్స్. రెండవది cloud స్టోరేజ్ కాన్సెప్ట్.
అంటే ఇంటర్నెల్ స్టోరేజ్ ప్రాబ్లెమ్స్ ను అధిగమించటానికి కంపెని 100GB ఫ్రీ క్లౌడ్ స్టోరేజ్ ను ఇస్తుంది. ఆఫ్ కోర్స్ క్లౌడ్ కాబట్టి దీనిని బాగా use చేసుకోవాలంటే మంచి ఇంటర్నెట్ కనెక్షన్ ఉండాలి.
స్పెక్స్ విషయానికి వస్తే… 5.2 in IPS LCD ఫుల్ HD గొరిల్లా గ్లాస్ 4 డిస్ప్లే, స్నాప్ డ్రాగన్ 808 hexa కోర్ 1.8GHz ప్రొసెసర్, 3GB ర్యామ్, adreno 418GPU.
2680mah, 32GB ఇంటర్నెల్ స్టోరేజ్, 13MP డ్యూయల్ LED ఫ్లాష్ రేర్ కెమెరా అండ్ 5MP ఫ్రంట్ కెమెరా, USB టైప్ C పోర్ట్, డ్యూయల్ ఫ్రంట్ లౌడ్ స్పీకర్స్.
ఆండ్రాయిడ్ మార్ష్ మల్లో అప్ డేట్, ఫుల్ HD విడియో రికార్డింగ్ తో ఫోన్ 19,999 రూ లకు రిలీజ్ అయ్యింది. ఫ్లిప్ కార్ట్ లో MAY 30 నుండి అందుబాటులోకి వస్తుంది. ఈ రోజు నుండి ప్రీ ఆర్డర్స్ చేసుకోగలరు. మొదటి కొంతమంది కస్టమర్స్ కు complimentary case కూడా ఇస్తుంది కంపెని.
లుక్స్ పరంగా అన్ని ఫోనుల కన్నా భిన్నమైన డిజైన్ తో వస్తుంది. క్లౌడ్ స్టోరేజ్ కాన్సెప్ట్ actual గా ఇంటర్నెట్ ఫాస్ట్ గా ఉన్న దేశాల్లో మంచి initiative. ఆఫ్ కోర్స్ ఇండియాలో కూడా WiFi ద్వారా ఇది apt అవుతుంది. కాని మొబైల్ ఇంటర్నెట్ అయితే 4G లేదా 3G స్పీడ్ సరిపోతుంది కదా అని అనుకున్నా డేటా లిమిట్ usage – consumption issues వస్తాయి.