Xiaomi పై చైనా లో ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది
చైనా లో కొత్తగా xiaomi యాడ్స్ చేసింది. అయితే అవి చైనా అడవర్టైస్మెంట్స్ Law కు వెతిరేకంగా ఉన్నాయని ఆరోపణలు ఎదుర్కొంది కంపెని.
Ads ఇండస్ట్రీ రేగులేటర్స్ స్మార్ట్ ఫోన్ కంపెని పై ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టారు అని చైనా డైలీ రిపోర్ట్ చేసింది. ఇంతకీ కారణం ఏంటంటే… కేవలం యాడ్స్ లో "the best" అనే మాటను వాడినందుకు.
ఇది కొత్త నిభందనల ప్రకారం చైనా కన్స్యూమార్ మార్కెట్ ను violate చేస్తుంది అని స్టేట్మెంట్ ఇచ్చింది చైనా ఇండస్ట్రీ రేగులేటర్స్ విభాగం.
గతంలో కూడా xiaomi, తన రెడ్మి నోట్ 2 ప్రోడక్ట్ లాంచ్ సమయంలో ఈ – కామర్స్ వెబ్ సైట్లలో తప్పుగా ప్రోమోట్ చేసింది అని రిపోర్ట్స్ ఉన్నాయి.
షార్ప్ కార్ప్ అనే కంపెని చే దాని డిస్ప్లే ప్యానల్స్ తయారు చేయబడ్డాయి అని చెప్పింది కాని వాస్తవానికి అవి tianma కంపెని తయారు చేసినట్లు కన్స్యూమర్స్ కనుగున్నారు. దీనికి Xiaomi, తమ ఉద్యోగి తప్పు వలన జరిగింది అని బదులిచ్చింది.
ఆధారం: చైనా డైలీ