ఇండియాలో రెండు 4GB ర్యామ్ మోడల్స్ ను లాంచ్ చేస్తున్న చైనీస్ కంపెని ఒప్పో

Updated on 29-Mar-2016

oppo బ్రాండ్ నుండి లేటెస్ట్ గా రెండు ఫ్లాగ్ షిప్ మోడల్స్ హై ఎండ్ స్పెక్స్ తో రిలీజ్ అయ్యాయి. వీటి పేరులు Oppo R9 అండ్ Oppo R9 ప్లస్. రెండూ 4GB ర్యామ్ తో రావటం హై లైట్.

ఇప్పుడు కంపెని ఈ రెండు మోడల్స్ ను ఏప్రిల్ 5 న రిలీజ్ చేయనుంది అని అనిపిస్తుంది. ఎందుకంటే కంపెని మీడియాకు "Camera phone launch" పేరుతో ఏప్రిల్ 5 న జరగబోయే ఈవెంట్ కు అటెండ్ అవ్వమని ఇన్విటేషన్స్ పంపింది.

ఒప్పో లాంచ్ చేసిన R9 మోడల్స్ కెమెరా ఎక్కువ ప్రాదాన్యత కలిగిన ఫోనులు. R9 ప్రైస్ సుమారు 29 వేలు ఉండగా, R9 ప్లస్ ధర 34 వేలు ఉండవచ్చు. అయితే చైనా బ్రాండ్ లను ఇంత రేట్ పెట్టి కొంటారా ఇండియన్ users అనేది కంపెననీలు పట్టించుకోని అసలు ప్రశ్న?

ఒప్పో R9 లో 5.5 in FHD డిస్ప్లే, 2GHz ఆక్టో కోర్ మీడియా టెక్ Helio P10 ప్రొసెసర్, 4GB ర్యామ్, 64GB ఇంబిల్ట్ స్టోరేజ్, 13MP రేర్ కెమెరా మరియు 16MP ఫ్రంట్ ఫెసింగ్ కెమెరా, 2850 mah బ్యాటరీ ఉన్నాయి.

ఒప్పో R9 ప్లస్ లో 6 in FHD డిస్ప్లే, 1.8GHz SD 652 ప్రొసెసర్, 4GB ర్యామ్, 64GB ఇంబిల్ట్ సోరేజ్, 16MP రేర్ అండ్ ఫ్రంట్ కేమేరాస్, 4120mah బ్యాటరీ ఉన్నాయి.

రెండు మోడల్స్ ఆండ్రాయిడ్ లాలిపాప్, డ్యూయల్ సిమ్ with హైబ్రిడ్ స్లాట్స్, సిమిలర్ డిజైన్, 128GB sd కార్డ్ సపోర్ట్ అండ్ ఫింగర్ ప్రింట్ స్కానర్స్ కలిగి ఉన్నాయి.

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India!

Connect On :