చిన్నవిగా వుండే దోమలు ప్రపంచంలోనే అత్యంత ప్రాణాంతకమైన జంతువు మరియు ఇతర జంతువుల కంటే ఎక్కువగా మానవులు వీటివల్ల చనిపోతున్నారు ,ఎందుకంటే ఇవి చూడటానికి చిన్నగా ఉంటాయి , కానీ వీటి కాటు వల్ల ఎన్నో ప్రాణాంతకమైన వ్యాధులు ఈ దోమలవల్లే వ్యాపిస్తున్నాయి . డెంగ్యూ, మలేరియా, పసుపు జ్వరం మరియు జిక్క దోమల ద్వారా వ్యాప్తి చెందే అనేక వ్యాధులు గా ఇప్పటివరకు మీకు తెలిసిన విషయమే . ఈ దోమలనుండి నుండి తమను కాపాడుకోవడాన్ని మరియు వాటి బ్రీడింగ్ ని అడ్డుకోవడాన్ని గురించి ఎన్నో ప్రజాసేవ ప్రకటనలు ఉన్నాయి. అయితే, LG K7i స్మార్ట్ఫోన్ ఈ విషయం లో మీకు ఎంతో బాగా ఉపయోగపడుతుంది .
దోమ కాటు నుండి కాపాడుకోవటానికి అత్యంత సాధారణమైన మార్గం ఇన్సెక్ట్ రెపెలెంట్ , సాధారణంగా లిక్విడ్రెపెలెంట్ . అయినప్పటికీ, ఈ రకమైన రెపెలెంట్ తో వచ్చే సమస్య ఏంటంటే వీటిలో బాగా కెమికల్స్ కలగలిసి ఉంటాయి . LG K7i సౌండ్ వేవ్ టెక్నాలజీ ని ఉపయోగిస్తుంది. ఇది అల్ట్రా సోనిక్ ఫ్రీక్వెన్సెస్ 30kHz ఇన్సెక్ట్స్ ని దూరంగా ఉంచుతుంది .
అల్ట్రా ఫ్రిక్వెన్సెస్ సౌండ్స్ వేవ్స్ ని దోమల వంటి కీటకాలు వినవచ్చు. కంపెనీ చెప్తున్న విధంగా మానవులకు పూర్తిగా హాని కలిగించదని కంపెనీ పేర్కొంది. క్లినికల్ పరీక్షలో, 72.32 శాతంఅనోఫిహిల్స్ గాంబియా దోమలు కొత్త టెక్నాలజీని తిప్పికొట్టాయి .
LG K7i వంటి చవకైన డివైస్ లో ఈ టెక్నాలజీని చేర్చడం ద్వారా, దోమల నుండి తమను తాము యూజర్స్ కాపాడుకోవచ్చని ఆశిస్తున్నాము.ఫోన్ ప్రత్యేక మోస్సిటో అవే కవర్ తో వస్తుంది, వినియోగదారులు స్టాండర్డ్ కవర్ ను మార్చుకొని టెక్నాలజీ ను ఉపయోగించడం ప్రారంభించ వచ్చు . సౌండ్ వేవ్ టెక్నాలజీని ఉపయోగించేటప్పుడు ఫోన్ ని పరిశీలించేందుకు ఒక మస్కిటో అవే స్టాండ్ కూడా ఉంది
ఫోన్ ఒక కాంపాక్ట్ 5-అంగుళాల ఆన్-సెల్ డిస్ప్లేతో వస్తుంది, ఇది కేవలం ఒక చేతితో సులభంగా హ్యాండిల్ చేయటానికి మరియు ఉపయోగించడానికి సులభం చేస్తుంది,ఒక పాకెట్ లో తీసుకువెళ్లడం కూడా సులభం. ఫోన్ 8.1mm తిక్నెస్ మరియు 138 గ్రాముల బరువు కలిగి వుంది .
ఈ LG K7i వచ్చి వెనుక వైపు 8MP కెమెరా , ఇక ఫ్రంట్ సైడ్ చూస్తే 5MP యూనిట్ కెమెరా లను కలిగి ఉంటుంది .
వెనుక కెమెరా 10 నిరంతర ఫోటోలతో బరస్ట్ షాట్లు తీసుకునే సామర్ధ్యం కలిగి ఉంటుంది. ముందు కెమెరా జెస్చర్ ఇంటర్వెల్ షాట్ ను కలిగి ఉంటుంది, ఇది సులభంగా సెల్ఫీస్ ని తీసుకోవటానికి సహాయం చేస్తుంది. యూజర్ వారి చేతిని పట్టుకున్నప్పుడు ఫోన్ గుర్తిస్తుంది మరియు తరువాత ఒక టైమర్ ను ప్రారంభిస్తుంది, తద్వారా వినియోగదారులు బటన్ ని నొక్కి ఉంచడం అవసరం.
ఇక ఈ ఫోన్ 1.1Ghz క్వాడ్ కోర్ ప్రోసెసర్ ని కలిగి ఇంకా 2GB RAM ని కలిగి వుంది . ఇది ప్లే స్టోర్ లో అందుబాటులో ఉన్న అనేక యాప్స్ ని అమలు చేయడానికి సరిపోతుంది. మరియు ఇది 16GB ఆన్ బోర్డు స్టోరేజ్ ని కలిగి 2500mAh బ్యాటరీ ని కలిగి వుంది .
దోమల దూరం గా పెట్టే ఈ ప్రత్యేక లక్షణం గల ఈ LG K7i యూజర్స్ ని బాగా ఎట్రాక్ట్ చేస్తుంది . మరియు మీరు దీనిని వాడేటప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ గా కూడా అనిపిస్తుంది .