పానసోనిక్ కొత్త Eluga Ray 700 తో Eluga బ్రాండ్ స్మార్ట్ఫోన్ల యొక్క లైన్ ని విస్తరించింది. ఎలుగ బ్రాండ్ క్రింద ఉన్న అన్ని ఇతర స్మార్ట్ఫోన్లలాగా, రే 700 కూడా హై ఎండెడ్ ఫీచర్ ను అందించే ఒక స్మార్ట్ఫోన్ ని అందించే లక్ష్యంతో ఉంటుంది, ఈ ధర కి ఇంత మంచి ఫీచర్స్ తో ఈ స్మార్ట్ ఫోన్ రావటం గమనార్హం .
పదండి ఈ పానాసోనిక్ ఎలుగా రే 700 స్పెసిఫికేషన్స్ ఫై ఒక స్మార్ట్ లుక్కేద్దాం .
Panasonic Eluga Ray 700 | Moto E4 Plus | Xiaomi Redmi 4 | Yu Yureka Black | |
ధర | Rs 9,999 | Rs 9,999 | Rs 8,999 | Rs 8,999 |
డిస్ప్లే | 5.5 ఇంచెస్ ఫుల్ HD | 5.5 inches HD | 5-inches HD | |
ప్రోసెసర్ | మీడియాటెక్ MTK6753 ఆక్టా -కోర్ | మీడియాటెక్ MTK6737 క్వాడ్ కోర్ | క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 435ఆక్టా -కోర్ | Qualcomm Snapdragon 430 octa-core |
ర్యామ్ | 3GB | 3GB | 3GB | 4GB |
స్టోరేజ్ | 32GB | 32GB | 32GB | 32GB |
13MP | 13MP | 13MP | 13MP | |
ఫ్రంట్ కెమెరా | 13MP | 5MP | 5MP | 8MP |
బ్యాటరీ | 5000mAh | 5000mAh | 4100mAh | 3000mAh |
ఫింగర్ ప్రింట్ సెన్సార్ | ||||
ఆండ్రాయిడ్ వెర్షన్ | ఆండ్రాయిడ్ నౌగాట్ | ఆండ్రాయిడ్ నౌగాట్ | ఆండ్రాయిడ్మార్షమేలౌ | ఆండ్రాయిడ్మార్షమేలౌ |
ఆకట్టుకునే కెమెరాల పెయిర్
పానసోనిక్ ఎలుగా రే 700 స్మార్ట్ ఫోన్ 13MP రేర్ కెమెరా తో పాటుగా 13MP ఫ్రంట్ కెమెరా కూడా కలిగి వుంది . రేర్ కెమెరా లో Sony IMX258 సెన్సార్ మరియు ఫాస్ట్ ఫోకసింగ్ కోసం పేస్ డిటెక్షన్ ఆటో ఫోకస్ (PDAF) కలవు . ఫ్రంట్ కెమెరా LED ఫ్లాష్ తో వస్తుంది , అంటే మీరు చీకట్లో కూడా సెల్ఫీ లు తీసుకోవచ్చు .
బిగ్ బ్యాటరీ
ఈ ఫోన్ లో మంచి కెమెరా తో పాటుగా దీని బ్యాటరీ కూడా మరింత స్పెషల్ అని చెప్పవచ్చు . Eluga Ray 700 లో 5000mAH బ్యాటరీ కలదు . దీని వల్ల మీరు ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఎన్నో గంటలు నిర్విరామంగా ఉపయోగించుకోవచ్చు . గేమ్స్ ఆడటానికి మరియు బ్యాక్ టు బ్యాక్ ఇమేజెస్ తీసుకోవటానికి కూడా 5000mAH బ్యాటరీ చాలా యూస్ ఫుల్ అవుతుంది . మరియు మీకు ఫోన్ ఛార్జ్ చేయటానికి ఎక్కువ సేపు వెయిట్ చేయవలిసిన అవసరం కూడా లేదు , ఎందుకంటే Eluga Ray 700 ఫాస్ట్ ఛార్జింగ్ సిస్టం ని ఆఫర్ చేస్తుంది .
డిజైన్
పానాసోనిక్ కి తెలిసిన విషయం ఏమిటంటే ఇంటర్నల్ హార్డ్వేర్ మాదిరిగా, స్మార్ట్ఫోన్ రూపకల్పన సమానంగా ముఖ్యమైనది.
అందుకే Eluga Ray 700 ని చక్కగా ఫిట్ అయ్యేలా డిసైన్ చేసారు . ఫోన్ యొక్క కార్నర్స్ రౌండ్ గ ఉండటం వల్ల దీనిని ఎక్కువ సేపు చేతితో పట్టుకోవచ్చు . ఈ ఫోన్ లో 5.5 ఇంచెస్ ఫుల్ HD డిస్ప్లే కలదు ,ఇది విజువల్స్ మంచిదని నిర్ధారిస్తుంది. అదనంగా, ఈ ఫోన్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ ను అందిస్తుంది.
పవర్ పెరఫార్మర్
పానాసోనిక్ ఎలుగ రే 700 మీడియా టెక్ MTK6753 ప్రాసెసర్ ని కలిగి ఉంది. దీనిలో 1.3GHz ఆక్టో కోర్ ప్రాసెసర్ ఉంది. సో మీరు ప్లే స్టోర్ లో అందుబాటులో వున్న చాలా గేమ్స్ మరియు యాప్స్ ని అమలు చేయగలరు.
మార్కెట్ లో అందుబాటులో వున్న మిగతా ఫోన్స్ లానే పానాసోనిక్ Eluga Ray 700 లో ఫింగర్ ప్రింట్ స్కానర్ కలదు . అయితే మిగతా ఫోన్స్ లా కాకుండా దీనిలోని స్కానర్ ని అన్లాక్ కి మాత్రమే కాక ఇంకా ఎన్నో వాటికి ఉపయోగించవచ్చు . ఇది స్క్రోల్ చేయడానికి,యాప్స్ ని అన్లాక్ చేయటానికి లేదా సెల్ఫీ లను తీసుకోవడానికి కూడా ఉపయోగించబడుతుంది.
మెమరీ
పానసోనిక్ ఎలుగ రే 700 3 జీబి ర్యామ్ ని కలిగి ఉంటుంది, ఇది చాలా పనిని చేయగలదు. ఇది కూడా మీరు చాలా ఇబ్బంది లేకుండా మల్టిపుల్ అప్లికేషన్లు మారగలరు అని అర్థం. స్టోరేజ్ గురించి మాట్లాడుతూ, ఇది 32GB స్టోరేజ్ కలిగి ఉంది, ఇది యాప్స్ , గేమ్స్ , ఫోటోలు మరియు వీడియోలను స్టోర్ చేయడానికి సరిపోతుంది. అయితే, మీరు మరింత స్పేస్ కావాలనుకుంటే, మైక్రోఎస్డీ కార్డ్ ద్వారా 128GB వరకు స్టోరేజ్ ని విస్తరించవచ్చు.
ఆండ్రాయిడ్ నౌగాట్
ఈ ఫోన్ ఆండ్రాయిడ్ v7.0 తో వస్తుంది . అంటే మీరు గూగుల్ యొక్క మొబైల్ ఆపరేటింగ్ సిస్టం వంటి మల్టీ విండో సపోర్ట్ అండ్ డోస్ యొక్క ఇంప్రూవ్డ్ ఇంప్రూవ్డ్ వెర్షన్ వంటి అన్ని సౌకర్యాలను పొందవచ్చు . మల్టీ విండో సపోర్ట్ తో పాటు మీరు సైడ్ బై సైడ్ 2 యాప్స్ ని రన్ చేయొచ్చు . కాబట్టి, ఒక టెక్స్ట్ కి రిప్లై ఇచ్చేటప్పుడు మీరు YouTube ని చూడవచ్చు.
డోస్ ని ఆండ్రాయిడ్ మార్ష్మల్లౌతో మరియు నౌగాట్ యొక్క ఉత్తమమైన వెర్షన్తో పరిచయం చేశారు.
కలర్
ఈ రోజుల్లో స్మార్ట్ఫోన్ కేవలం ఒక గాడ్జెట్ కాదు, కానీ అది కూడా ఒక లైఫ్ స్టయిల్ ప్రోడక్ట్ . పానాసోనిక్ ఎలుగ రే 700 అనేది 3 రంగులలో ఉంటుంది. ఇది మోచా గోల్డ్, మెరైన్ బ్లూ మరియు షాంపైన్ గోల్డ్ రంగులలో లభిస్తుంది. సో మీరు మీకు నచ్చిన కలర్ ఎంచుకోవచ్చు.
VoLTE
కాలింగ్ విషయంలో VoLTE ముఖ్యం. కొత్త టెక్నాలజీ చాలా లాభాలను అందిస్తుంది. అంటే మీరు మంచి ఆడియో క్వాలిటీ కోసం HD కాలింగ్ మరియు ఫాస్ట్ కాల్ కనెక్షన్ల ఎంపికను కలిగి ఉంటారు.