LeTV స్మార్ట్ ఫోన్ కంపెని నుండి వెరీ హై ఎండ్ స్పెక్స్ తో కొత్త ఫోన్ అనౌన్స్
స్నాప్ డ్రాగన్ వెరీ లేటెస్ట్ ప్రాసెసర్ 820 తో చైనీస్ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ LeTV Le Max ప్రో ను అనౌన్స్ చేసింది. ఈ SoC తో ఇదే మొదటి ఫోన్. CES లో unveil అయ్యింది. (గమనిక : CES లో మొబైల్స్ అన్నీ అనౌన్స్ అవటమే జరుతుంది, మార్కెట్ లో రిలీజ్ అవటానికి రెండు మూడు నెలలు పైనే తీసుకుంటాయి. )
స్పెసిఫికేషన్స్ – సెన్స్ ID ఫింగర్ ప్రింట్ టెక్నాలజీ కలిగిన SoC, అల్ట్రా సోనిక్ బయోమెట్రిక్ సెన్సార్ తో వస్తుంది. అంటే ఇది మెటల్ లేదా గ్లాస్ పై నుండి కూడా ఫింగర్ ప్రింట్స్ ను రీడ్ చేస్తుంది.
6.33 in WQHD 2560×1440 పిక్సెల్స్ డిస్ప్లే, 21MP కెమెరా, ఆండ్రాయిడ్ M, 32/64/128GB స్టోరేజ్ వేరియంట్స్, 3400 mah బ్యాటరీ, క్విక్ చార్జింగ్ సపోర్ట్ 2.0, usb టైప్ C పోర్ట్.
క్వాల్ కామ్ కంపెని స్నాప్ డ్రాగన్ 820 ప్రాసెసర్ నవంబర్ లో రిలీజ్ చేసింది. కంపెని మాటల ప్రకారం ఇది 810 కన్నా డబుల్ పెర్ఫార్మెన్స్ ఇస్తుంది. 14nm FinFET fabrication ప్రాసెస్ తో నాలుగు custom cpu కోర్స్ కలిగి ఉంది.