ఆపిల్ నెక్స్ట్ మోడల్ , ఐ ఫోన్ 6S డిటేల్స్

ఆపిల్ నెక్స్ట్ మోడల్ , ఐ ఫోన్ 6S డిటేల్స్
HIGHLIGHTS

ఆండ్రాయిడ్ ఫోనుల్లో ఉండే స్పెక్స్ ఇప్పుడు ఈ మోడల్ లో..

ఆపిల్ ఈ సంవత్సరం సెప్టెంబర్ లో ఆపిల్ 6S మోడల్ ను లాంచ్ చేస్తుంది. ఇప్పటి వరకూ ఉన్న లేటెస్ట్ మోడల్స్, ఐ ఫోన్ 6 అండ్ 6 ప్లస్. 

6S మోడల్ కు సంబంధించి చైనా టెలికాం అఫిషియల్ గా కొన్ని విషయాలను వెల్లడించింది. 6S మోడల్ లో 2GB ర్యామ్ ఉండనుంది. ఇదే మొదటి సరి ఆపిల్ ఇంత ర్యామ్ ను వాడటం.లేటెస్ట్ 6 అండ్ 6 ప్లస్ లో కూడా 1gb ర్యామ్ వాడింది.

12MP కెమేరా, A9 ప్రొసెసర్ చిప్ సెట్ కూడా అప్ గ్రేడ్ అవుతున్నాయి. సాధారణంగా ఆపిల్ S సిరిస్ మోడల్స్ లో పెద్దగా ఇంప్రూవ్ చేయదు, కాని 6S కు అనుకున్న దాని కన్నా ఎక్కువ హార్డ్ వేర్ స్పెక్స్ ను ఇస్తుంది.

ఇవి కాకుండా ఆపిల్ అఫిషియల్ గా అనౌన్స్ చేసిన విషయం రాబోయే 6S లో ఫోర్స్ టచ్ ను ప్రవేశపెడుతుంది. ఇది మీరు ఎంత టచ్ చేసిన త్రివ్రత బట్టి టచ్ ఆప్షన్స్ పనిచేస్తాయి. అంటే స్లో గా టచ్ చేస్తే ఒక పని, కొంచెం బలంగా, ఫోర్స్ గా టచ్ చేస్తే మరొక ఆప్షన్ పనిచేస్తుంది. అయితే ఇది ఇప్పటికే అప్ కమింగ్ ఆండ్రాయిడ్ ఫోనుల్లో కూడా రానుంది అని న్యూస్.

6S తో పాటు ఆపిల్ 6C మోడల్ కూడా లాంచ్ చేస్తుంది అని రూమర్స్ వస్తున్నాయి. సెప్టెంబర్ 18 నుండి 25 లోపు చైనా లో 6S లాంచ్ అవుతుంది అని చైనా టెలికాం చెబుతుంది. కాని సెప్టెంబర్ 9 వ తారీఖున జరుగుతుంది అని వేరే సమాచారం. ఏదైనా సరే డిజైన్ పరంగా మాత్రం ఎటువంటి ప్రధాన మార్పులు ఉండవు.

ఆధారం: ఫోన్ ఏరేనా

Shrey Pacheco

Shrey Pacheco

Writer, gamer, and hater of public transport. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo