డిల్లీలో HTC ఫోనుల కొనుగోలుపై వార్నింగ్స్

Updated on 24-Jun-2015
HIGHLIGHTS

స్వయంగా ఫోన్ రిటేలర్స్ నుండే హెచ్చరికలు

డిల్లీ లోని మొబైల్ రిటేల్ షాప్ లలో ( ప్రధానంగా కరోల్ బాగ్ ఏరియాలో ) HTC ఫోనులకు వ్యతిరేకంగా కొన్ని హోర్డింగ్ లు కనిపిస్తున్నాయి. "HTC ఫోనులు మీ సొంత రిస్క్ తో కొనండి." అని వాటి ఉద్దేశం. 

విషయం లోకి వెళితే HTC కంపెని, సేల్స్ తరువాతి కస్టమర్ కేర్ సర్వీస్ ను అస్సలు పట్టించుకోవటం లేదు అని డిల్లీ లో స్మార్ట్ ఫోన్ షాప్ అమ్మకందారులు అంటున్నారు. అయితే వింతగా HTC కన్నా ముందుగా ఆఫ్టర్ సేల్స్  సర్వీస్ లను, మన లోకల్ ఇండియన్ కంపెనీలు చాలా వరకూ సరిగా పట్టించుకోవు అని స్మార్ట్ ఫోన్ వాడని మొబైల్ యూజర్ కు సైతం తెలిసిన విషయం.

అయితే అది వినియోగదారుల కు సంబంధించిన విషయం కాబట్టి మొబైల్ రిటేలర్స్ పట్టించుకోరు, కాని వాటిని ఏమి పట్టించుకోకుండా ఇలా HTC పై ఇలాంటి ప్రచారం చేయటం కొంత మేరకు ఆశ్చర్యంగా ఉంది. అయితే రిటేలర్స్ వాదన ఏంటంటే, HTC నిర్లక్ష్యం కారణంగా వాళ్ల స్టోర్స్ నుండి htc ఫోనులను కొనుగులు చేసిన వారు, అమ్మకందారులుపై విముకుత చూపిస్తున్నారు అని అంటున్నారు.

అయితే HTC కస్టమర్ కేర్ సిబ్బంది మాత్రం ఈ విషయాన్ని నిరాకరించారు. గుర్తు తెలియని "Delhi Mobile Association"  పేరుతో జరుగుతున్న ఈ హోర్డింగ్స్ ప్రచారం HTC డిస్ట్రిబ్యూషన్ ను దెబ్బ తీయటానికి కావాలని చేస్తున్న చర్యలు అని అంటున్నారు. దీనిపై HTC, ఇండియా నుండి ఎటువంటి స్పందన లేదు.

ఈ విషయానికి సంబంధించి ట్విట్టర్ లో కూడా పోస్ట్ వచ్చింది. ఎక్కడైతే ఏ చిన్నది జరిగిన ఓవర్ పబ్లిసిటీ చేస్తారో, అక్కడే ఈ విషయం పోస్ట్ అయ్యింది. ఈ మొత్తం ఉదంతంలో రిటేలర్స్ చెప్పే విషయంలో ఎంతవరకూ నిజం ఉందో తెలియదు కాని , సోషల్ నెట్ వర్కింగ్ లో పోస్ట్ అయినందున, ఇక HTC కి మాత్రం ఎంతోకొంత ఎఫెక్ట్ చూపిస్తుంది ఈ విషయం. ఈ సంఘటన పై HTC ను సంప్రదించాము, వాళ్ల అధికారిక రెస్పాన్స్ కోసం ఎదురుచూస్తున్నాము.

https://twitter.com/mayankshivu/status/611531217146503168

ఆధారం: Trak.in

 

 

Connect On :