Budget Phones: ప్రస్తుతం భారత మార్కెట్ లో చాలా చవక ధరలో కూడా గొప్ప ఫీచర్లు కలిగిన స్మార్ట్ ఫోన్ లు లభిస్తున్నాయి. 6 వేలకే 60 వేల ఫోన్ లో ఉన్న ఫీచర్ కలిగిన ఫోన్ కావాలన్నా కూడా ఆప్షన్స్ అందుబాటులో ఉన్నాయి. బడ్జెట్ కేటగిరిలో కూడా కొన్ని స్మార్ట్ ఫోన్ లు ప్రీమియం ఫోన్ లు కలిగి ఉండే ఒక ఫీచర్ ను మరియు ప్రీమియం మాదిరి డిజైన్ ను కూడా కలిగి ఉన్నాయి. అందుకే, అటువంటి బెస్ట్ స్మార్ట్ ఫోన్స్ గురించి ఈరోజు మనం తెలుసుకుందామా.
ఐఫోన్ లేటెస్ట్ ప్రీమియం ఫోన్ ఐఫోన్ 15 కలిగినటువంటి డైనమిక్ ఐల్యాండ్ మాదిరిగా కనిపించే ఫీచర్ తో ఇండియన్ మార్కెట్ చాలా బడ్జెట్ స్మార్ట్ ఫోన్ లు విడుదల చేయబడ్డాయి. అయితే, వాటిలో 3 స్మార్ట్ ఫోన్లు మాత్రం కేవలం 6 వేల బడ్జెట్ ధరలో కూడా లభిస్తున్నాయి. ఆ మూడు ఫోన్లను ఇక్కడ చూడవచ్చు.
Price : Rs. 6,299
ఇన్ఫినిక్స్ ఇండియాలో సరికొత్తగా విడుదల చేసిన ఈ స్మార్ట్ ఫోన్ ఈ లిస్ట్ లో ముందుంటుంది. ఈ ఫోన్ మినీ రింగ్ గా పిలవబడే సెల్ఫీ కెమేరా నోటిఫికేషన్ బార్ తో వస్తుంది. ఈ ఫోన్ లో 3 GB RAM, 64 GB స్టోరేజ్, 6.6 బిగ్ డిస్ప్లే, 13MP AI డ్యూయల్ కెమేరా, 5000 mAh వంటి ఆకర్షనీయమైన ఫీచర్లు కూడా ఉన్నాయి. ఈ ఫోన్ అందమైన డిజైన్ తో కూడా ఆకట్టుకుంటుంది. Buy From Here
Also Read : MOTOROLA g24 Power: ప్రీమియం డిజైన్ మరియు Dolby Atmos తో చవక ధరలో లాంచ్.!
Price : Rs. 6,499
టెక్నో సరికొత్తగా విడుదల చేసిన ఈ ఫోన్ కూడా ఈ లిస్ట్ బెస్ట్ ఫోన్ గా నిలుస్తుంది. ఈ టెక్నో ఫోన్ కూడా Dynamic Port గా పిలవబడే నోటిఫికేషన్ బార్ ను కలిగి ఉంటుంది. ఈ ఫోన్ ఈ ధరలో DTS సౌండ్ సపోర్ట్ తో డ్యూయల్ స్పీకర్లు కలిగిన ఏకైక ఫోన్ గా నిలుస్తుంది. ఈ ఫోన్ లో 6.56 ఇంచ్ డాట్ డిస్ప్లే, 5000mAh బ్యాటరీ, 12MP AI డ్యూయల్ కెమేరా, 4GB RAM + 4GB మెమెరీ ఫ్యూజన్ ర్యామ్ తో 64GB స్టోరేజ్ వంటి ఫీచర్లను కలిగి ఉంటుంది. Buy From Here
Price : Rs. 6,999
టెక్నో నుండి వచ్చిన ఈ ఫోన్ కూడా దాదాపుగా టెక్నో పాప్ 8 ఫోన్ మాదిరి స్పెక్స్ నే కలిగి ఉంటుంది. ఈ ఫోన్ లో 90Hz రిఫ్రెష్ రేట్ కలిగిన 6.56 ఇంచ్ HD+ డిస్ప్లేని Dynamic Port ఫీచర్ తో కలిగి వుంది. ఈ ప్రైస్ సెగ్మెంట్ లో DTS డ్యూయల్ స్పీకర్స్ తో వచ్చిన మొదటి ఇదే. ఈ ఫోన్ లో కొద 4GB ర్యామ్ + అధనపు ర్యామ్ తో పటు 64GB స్టోరేజ్ ఉన్నాయి. Buy From Here