స్టేట్ ప్రొవైడర్, BSNL ప్రస్తుతుం ఉన్న మినిమమ్ బ్రాడ్ బాండ్ ఇంటర్నెట్ స్పీడ్, 512 kbps బాండ్ విడ్త్ ను 2mbps కు పెంచింది. ఇది అక్టోబర్ 1 నుండి ఎఫెక్ట్ అవుతుంది అందరికీ.
మీరు ప్రస్తుతం 512kbps లేదా 1mbps ఇంటర్నెట్ ప్లాన్ లో ఉంటే, అది ఆటోమేటిక్ గా 2 mbps కు అప్ గ్రేడ్ అవుతుంది అక్టోబర్ 1 నుండి. దీనికి bsnl అదనపు చార్జీలు తీసుకోవటం లేదు. అంటే ఫ్రీ అప్ గ్రేడ్.
ఫెయిర్ యూసేజ్ పాలిసీ (FUP), అంటే మీ ప్లాన్ ప్రకారం ఇచ్చిన మాక్సిమమ్ డేటా ను వాడక ముందు స్పీడ్ 2mbps వస్తుంది. అది దాటితే 512 kbps కు పడిపోతుంది స్పీడ్.
ఈ 2mbps అప్ గ్రేడ్ కొత్త యూజర్స్ మరియు ఆల్రెడీ bsnl బ్రాడ్ బాండ్ ఇంటర్నెట్ వాడుతున్న వారికీ వర్తిస్తుంది. ప్రైవేట్ నెట్ వర్క్స్ నుండి బాగా పోటీ ఎక్కువ అవటంతో bsnl ఈ నిర్ణయాలు తీసుకున్నట్లు రిపోర్ట్స్.
ఇంతకముందే bsnl 3G ఇంటర్నెట్ టారిఫ్ లను కూడా 50% తగ్గించనుంది అని అనౌన్స్ చేసింది. అలాగే నైట్ కాల్స్ 9pm టు 7am bsnl లాండ్ లైన్ కనెక్షన్ ఫోన్ లలో ఫ్రీ గా చేసింది.