బిఎస్ఎన్ఎల్ వినియోగదారులు ఇకనుండి ఉపయోగించని మొబైల్ డేటాను నెక్స్ట్ రీఛార్జ్ డేటా ప్యాక్ లో వాడుకునే అవకాశం

Updated on 22-May-2015
HIGHLIGHTS

బిఎస్ఎన్ఎల్ కొత్త క్యారీ ఫార్వార్డ్ డేటా సర్విస్ తో దేశవ్యాప్తంగా మరింత వినియోగదారులను పెంచుకోనుంది.

ప్రభుత్వరంగ టెలికాం ఆపరేటర్ బిఎస్ఎన్ఎల్ వినియోగదారులు వారి కొత్త డేటా రీఛార్జ్ తో వాళ్ళు ఇంతకముందు డేటా ప్యాక్ లో ఉపయోగించని మొబైల్ ఇంటర్నెట్ డేటా ను ఫార్వార్డ్ చేసుకునే ఆఫర్ ను ప్రకటించింది బిఎస్ఎన్ఎల్. ఇది 2G మరియు 3G ప్రీపెయిడ్ బిఎస్ఎన్ఎల్ అన్ని రాష్ట్రాలలో అమల్లోకి వచ్చింది.

తాజాగా బిఎస్ఎన్ఎల్ రూ.68 కు పది రోజుల పాటు 1జిబి 3G డేటా ఆఫర్ ఒకటి తీసుకువచ్చింది. ఇది టెలికాం మార్కెట్లో అతి తక్కువ రిచార్జ్ ఆఫర్. వినియోగదారులకి క్వాలిటీ మరియు సంతృప్తికరమైన సేవను ఇవ్వడమే మిగతా టెలిఫోన్ కంపెనీలకి మాకు తేడా." అని బిఎస్ఎన్ఎల్ కన్స్యూమర్ మొబిలిటీ డైరెక్టర్, యన్.కే గుప్తా అన్నారు. ఈ ఆఫర్ తో బిఎస్ఎన్ఎల్ ఎక్కువ డేటాను వాడే కస్టమర్స్ ను సంపాదించుకుంటుంది.

తాజాగా  TRAI టెలికాం డేటా ప్రకారం బిఎస్ఎన్ఎల్ మరియు ఎంటిఎన్ఎల్ కలిపి 8.32 షేర్ మార్కెట్ తో ఉంటే, ప్రవైట్ టెలికాం ఆపరేటర్లు 91.68 షేర్ ను సంపాదించుకున్నారు. అందువలన బహుశా బిఎస్ఎన్ఎల్ సరికొత్త డేటా ఆఫర్ ను ముందుకు తీసుకు వచ్చింది. ఈ డేటా ఫార్వార్డింగ్ ఆఫర్ డేటా ను పూర్తిగా ఉపయోగించుకోని కస్టమర్స్ కు బాగా ఉపయోగపడుతుంది. కాకపొతే బిఎస్ఎన్ఎల్ తో పాటు డొకోమో కూడా తాజాగా ఈ ఆఫర్ ను విడుదల చేసింది. అలాగే ఇదే ఆఫర్ వోడాఫోన్ కూడా ప్రారంభించింది కానీ అది మహారాష్ట్ర మరియు గోవా రాష్ట్రాల్లోనే. వోడాఫోనే తమ సర్వీసులు కేవలం ఫాస్ట్ గానే కాడు స్మార్ట్ గ కూడా ఉంటాయి అని చెబుతుంది. అయితే మూడు టెలికాం ఆపరేటర్లు ఈ డేటా ఫార్వార్డ్ ప్లాన్ ను 2G మరియు 3G ప్రీపెయిడ్ కస్టమర్లకు మాత్రమే ఇస్తున్నారు .

Connect On :