లాండ్ లైన్ అండ్ మొబైల్ సబ్స్టేషనులను కలిపేస్తుంది BSNL

Updated on 19-Oct-2015
HIGHLIGHTS

లాండ్ లైన్ కు వచ్చే కాల్స్ ను మొబైల్ లో లిఫ్ట్ చేయగలరు

BSNL కొత్త నిర్ణయాలు తీసుకుంటుంది. లాండ్ లైన్ సబ్స్ స్క్రైబర్స్ మరియు మొబైల్స్ వినియోగదారులు ను కలిపే విధంగా ప్రతిపాదనలు చేయనుంది. ఇది అతి త్వరలోనే వస్తుంది.

మొబైల్ మరియు లాండ్ లైన్ కనెక్షన్స్ పై విడివిడిగా ఉండే ఆఫర్స్, ప్లాన్స్ ను రెండింటిలోనూ వాడుకునేలా చేస్తుంది.  అంటే లాండ్ లైన్ కు వచ్చే కాల్స్ – మొబైల్స్ లో కూడా లిఫ్ట్ చేయవచ్చు.

అలానే లాండ్ లైన్ మరియు modem కు కనుక సబ్స్ స్క్రైబ్ అయ్యి ఉంటే, మొబైల్స్ లో కూడా ఫ్రీ night కాల్స్ వాడుకోగలరు. TRAI తాజాగా BSNL లాండ్ లైన్ కనెక్షన్స్ ఆగస్ట్ నెలలో బాగా disconnect అయ్యాయి..

కాని మొబైల్ కనెక్షన్స్ మాత్రం 8,12,000 కొత్తగా యాడ్ అయ్యాయి అని తెలిపింది గత వారంలో. అదే రిపోర్ట్స్ ప్రకారం భారతీ ఎయిర్టెల్ లో మాత్రం మొబైల్ అండ్ లాండ్ లైన్ రెండింటిలోనూ ఎక్కువ సబ్స్ స్క్రిప్షన్స్ వచ్చాయి.

BSNL అక్టోబర్ 1 నుండి మినిమమ్ 1MBPS ఇంటర్నెట్ స్పీడ్ ను ఇస్తున్నట్లు గత నెలలో అనౌన్స్ చేసింది. 512kbps అండ్ 1mbps పై ఉన్నవారికి 2mbps అప్ ఫగ్రేడ్ వస్తుంది. 

అలాగే లాండ్ లైన్ ఫోన్లలో రాత్రి 9 గం నుండి ఉదయం 7 గం వరకూ ఎన్ని కాల్స్ చేసినా అన్నీ ఫ్రీ గా ఇస్తున్నట్లు ప్రకటన చేసింది

Shrey Pacheco

Writer, gamer, and hater of public transport.

Connect On :