ఈ సంవత్సరం ఫిబ్రవరి నెలలో ఉబుంటు os మీద పని చేసే మొట్ట మొదటి మోడల్ ను లంచ్ చేసింది BQ కంపెని. అయితే అది అంతగా సక్సెఫుల్ కాలేదు. కాని మళ్ళీ BQ స్మార్ట్ ఫోన్ కంపెని ఉబుంటు ఓస్ మీదనే రెండవ మోడల్ ను లాంచ్ చేస్తుంది.
ఈ మోడల్ BQ Aquaris E5 పేరుతో లాంచ్ అవనుంది. దీని స్పెసిఫికేషన్స్ ప్రస్తుత మార్కెట్ కు పోటీ ఇచ్చే అంత పెద్దవి కాదు, కాని ఉబుంటు ప్లాట్ఫారమ్ కు పెద్ద పెద్ద ప్రాసెసర్స్, ర్యామ్ లు అవసరం లేదు అని చెబుతుంది ఉబుంటు. మొదటి మోడల్ 4.5 in స్క్రీన్ తో వస్తే, రెండవ మోడల్ 5in 720P IPS HD స్క్రీన్ డిస్ప్లే తో వస్తుంది. మీడియా టెక్ 1.3 GHz క్వాడ్ కోర్ A7 కార్టెక్స్ CPU దీనిలో ఉంది. 1జిబి ర్యామ్, 16జిబి స్టోరేజ్ ఉబుంటు రెండవ మోడల్ లో ఉన్నాయి. డ్యూయల్ సిమ్ ఫంక్షనాలిటీ ఉన్న ఈ స్మార్ట్ ఫోన్ లో 13MP కెమేరా డ్యూయల్ LED ఫ్లాష్ మరియు 5MP ఫ్రంట్ కెమేరా దీని సొంతం.
BQ Aquaris E5 జూన్ మిడ్ లో యూరోప్ దేశాలలో దాదాపుగా 15,000 రూ. లకు లభ్యం అవుతుంది. అయితే మొదటి ఉబుంటు మోడల్ BQ Aquaris E వలె ఇది కూడా ఇతర దేశాలలో అమ్మకాలను చేసుకుంటుందా లేక ఇండియాలో కూడా మార్కెటింగ్ చేయనుందా అనేది ఇంకా స్పష్టం కాలేదు. ఒక వేల ఇండియాలో రిలీజ్ అయినప్పటికీ ప్రస్తుత స్మార్ట్ ఫోన్ OS లు వాడి బోర్ కొట్టిన వారు తప్పితే మిగతా సెగ్మెంట్ తక్కువ స్పెక్స్ ఉన్న ఉబుంటు E5 ను తీసుకుంటారని చెప్పలేం.
ఆధారం: GSM Arena