3D టచ్ సపోర్ట్ & 4GB ర్యామ్ తో Pure XR ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ లాంచ్

Updated on 30-Aug-2016

అమెరికన్ కంపెని BLU కొత్తగా Pure XR పేరుతో స్మార్ట్ ఫోన్ లాంచ్ చేసింది. సుమారు 20 వేల రూ లకు గ్లోబల్ అమెజాన్ వెబ్ సైట్ లో సేల్స్ అవుతుంది.

గతంలో కొన్ని మోడల్స్ ఇండియన్ మార్కెట్ లోకి విడుదల అయ్యాయి ఇదే బ్రాండ్ నుండి. సో ఇది కూడా వస్తుంది అని అంచనా.  క్రింద ఫోన్ యొక్క ఇమేజెస్ చూడగలరు..


              పైన ఉన్న ఇమేజ్ లో 3D టచ్ సపోర్ట్ శాంపిల్ గమనించగలరు

అసలు ప్రపంచంలో ఎక్కడ ఫోన్ రిలీజ్ అయినా 90% కంపెనీలు ఇండియన్ మార్కెట్ పై ద్రుష్టి పెట్టడానికే ప్రిఫర్ చేస్తాయి. కారణం ఇండియా లో స్మార్ట్ ఫోన్ మార్కెట్ బాగా ఎక్కువుగా ఉంటుంది.

సో ఫోన్ స్పెక్స్ విషయానికి వస్తే .. దీనిలో ముందుగా 3D టచ్ ఉంది. ఇప్పటివరకూ ఇది ఆపిల్ ఫోనుల్లోనే ఉంది 3D. ఇది సాఫ్ట్ గా టచ్ చేస్తే యాప్ ఓపెన్ చేయకుండానే యాప్ లోని ఫంక్షన్స్ ను డైరెక్ట్ గా access అయ్యేలా చేస్తుంది.

ఇంకా డ్యూయల్ సిమ్, 5.5 in FHD సూపర్ అమోలేడ్ డిస్ప్లే with 401PPi అండ్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ డిస్ప్లే, మీడియా టెక్ Helio P10 MT6755 ఆక్టో కోర్ ప్రొసెసర్, 4GB ర్యామ్, 64GB ఇంబిల్ట్ స్టోరేజ్.

64GB SD కార్డ్ సపోర్ట్, 16MP రేర్ లేసర్ ఫోకస్ LED ఫ్లాష్ కెమెరా అండ్ 8MP ఫ్రంట్ కెమెరా, 3000 mah బ్యాటరీ, ఆండ్రాయిడ్ 6.0 OS, USB టైప్ C పోర్ట్.

ఫింగర్ ప్రింట్ స్కానర్, మెటల్ unibody, క్విక్ చార్జింగ్ సపోర్ట్,  4G LTE, బ్లూ టూత్ 4.0 తో ఫోన్ బరువు 147 గ్రా ఉంది. గోల్డ్ అండ్ గ్రే కలర్స్ లో అందుబాటులో ఉంది ఫోన్. ఈ లింక్ లో ఫోన్ యొక్క స్పెక్స్ ను అఫీషియల్ సైట్ లో చూడగలరు.

PJ Hari

Gadget Geek. Movie Buff. Non fiction Books

Connect On :