కొత్తగా రెండు విండోస్ 8.1 స్మార్ట్ ఫోన్స్ లాంచ్
రెండూ విండోస్ 10 అప్ గ్రేడ్, 4G LTE సపోర్ట్ తో వస్తున్నాయి
US బేస్డ్ manufacturing కంపెని, Blu రెండు విండోస్ 8.1 స్మార్ట్ ఫోన్స్ ను ఇండియన్ మార్కెట్ లో లాంచ్ చేసింది. ఈ రెండు ఫోనులకు 4G LTE సపోర్ట్ ఉంది. ఒకటి Blu Win JR LTE, రెండవది Blu Win HD LTE.
Blu Win JR LTE స్పెసిఫికేషన్స్ – 4.5 in IPS డిస్ప్లే, 1.2 GHz క్వాడ్ కోర్ స్నాప్ డ్రాగన్ 410 ప్రొసెసర్, 1gb ర్యామ్, 8gb ఇంబిల్ట్ స్టోరేజ్, 32gb అదనపు స్టోరేజ్ సపోర్ట్, 5MP రేర్ కెమేరా, VGA ఫ్రంట్ కెమేరా, 2000 mah బ్యాటరీ. Grey, వైట్, Yellow , ఆరెంజ్, పింక్ కలర్స్ లో ఇది 5,999 రూ లకు సేల్ అవనుంది.
Blu Win HD LTE స్పెసిఫికేషన్స్ – 5 in HD IPS డిస్ప్లే, 2MP ఫ్రంట్ కెమేరా, 2500 mah బ్యాటరీ మినహా అన్నీ win JR మోడల్ లో ఉన్న స్పెక్స్ ఉన్నాయి దీనిలో. పింక్ కలర్ తప్ప ఇది కూడా సేమ్ అవే కలర్ వేరియంట్స్ లో వస్తుంది. దీని ధర 7,999 రూ.
ఈ రెండు ఫోనులు విండోస్ 8.1 os పై పనిచేస్తాయి. ఫేస్బుక్, స్కైప్, ఆఫీస్, onedrive, onenote ప్రీ లోడ్ అయ్యి వస్తాయి. win JR అండ్ HD రెండూ.. విండోస్ 10 వెర్షన్ కు అప్ గ్రేడ్ అవుతాయి. బహుశా ఈ ఒక్క పాయింట్ మాత్రమే ఈ ఫోనులో ఉన్న ప్లస్. కాని కేవలం os మీద ఎంత ప్రేమ ఉంటే స్పెక్స్ మినిమమ్ కూడా లేని ఫోన్ తీసుకుంటారు స్మార్ట్ ఫోన్ users..!