Silent Circle చే సెక్యూరిటీ ఫోకస్ గా BlackPhone 2 అనే స్మార్ట్ ఫోన్ తయారు అయ్యింది. ఇప్పుడు ఇది నార్త్ అమెరికా లో సేల్స్ కూడా స్టార్ట్ చేసింది. 52,718 రూ దీని ధర.
ఏంటి దీనిలో ఉన్న సెక్యూరిటీస్..?
ఆండ్రాయిడ్ బేస్డ్ os తో సైలెంట్ కస్టమ్ os పై రన్ అవుతుంది. ఇది ప్రైవెసీ, సెక్యురిటీ కు సంబంధించి సిస్టం అండ్ యాప్స్ తో వస్తుంది.
spaces అనే ఫీచర్ తో యూసర్ ఫోనులో 4 స్పేసెస్ క్రియేట్ చేసుకొని virtual డివైజ్ గా వాడుకోవచ్చు. ఈ నాలుగు స్పెసెస్ లో ఎక్కడైనా యాప్స్ అండ్ డేటా ను స్టోర్ చేయగలరు.
సో, ఒక దాని తో మరొక దానికి సంబంధం ఉండదు. దీనిలో బ్లాక్ బెర్రీ వాలే ఎంటర్ప్రైజెస్ సిస్టం కూడా ఉంది.
peer – to- peer encrypted వీడియో కాలింగ్, ఆడియో కాలింగ్ అండ్ టెక్స్ట్ మెసేజింగ్ ఉంది బ్లాక్ ఫోన్ 2 లో. అంటే వీటిని ఎవరూ హ్యాక్ మరియు రికార్డ్ చేయలేరు.
దీని స్పెసిఫికేషన్స్ – 5.5 in FHD గొరిల్లా గ్లాస్ డిస్ప్లే, ఆక్టో కోర్ క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ ప్రొసెసర్, 3gb ర్యామ్, 13MP BSI సెన్సార్ కెమెరా, 5MP ఫ్రంట్ కెమెరా.
32gb ఇంబిల్ట్ స్టోరేజ్, 128gb sd కార్డ్ సపోర్ట్, 3060 mah బ్యాటరీ, క్విక్ చార్జ్ 2.0 సపోర్ట్, 4G LTE ఇంటర్నెట్ కనెక్టివిటి తో 152.4 x 76.4 x 7.9 mm డైమెన్షనస్ లో ఉంది బ్లాక్ ఫోన్ 2.
ఇది బ్లాక్ ఫోన్ మోడల్ కు అప్ గ్రేడ్ ఫోన్. అది సక్సెస్ అవటంతో ఈ రెండవ మోడల్ మరింత సెక్యూర్ సిస్టం తో తెచ్చాము అని కంపెని చెబుతుంది.