గత వారం బ్ల్లాక్ బెర్రీ ఆండ్రాయిడ్ ఫోన్ పై పనిచేస్తుంది అని చెప్పటం జరిగింది. Venice కోడ్ పేరుతో ఇది టెస్టింగ్ ప్రొసెస్ లో ఉంది ప్రస్తుతానికి. US లో AT&T నెట్ వర్క్ పై సేల్ అవుతుంది ఇది అని రిపోర్ట్స్.
అయితే ఇప్పుడు ఈ స్మార్ట్ ఫోన్ టెస్టింగ్ మరియు ఎవల్యూషన్ పర్పస్ తో ఇండియాకి వచ్చింది అని లేటెస్ట్ రిపోర్ట్స్. SQW100-1 మరియు STV100-3 అని రెండు బ్లాక్ బెర్రీ మోడల్స్ వచ్చాయి. వాటిలో ఒకటి Venice కోడ్ నేమింగ్ తో ఉన్న ఆండ్రాయిడ్ బెర్రీ మోడల్ మరో మోడల్ పేరు బ్లాక్ బెర్రీ డల్లాస్.
బ్లాక్ బెర్రీ డల్లాస్ రూమర్డ్ స్పెక్స్ – స్నాప్ డ్రాగన్ 801 2.2 GHz క్వాడ్ కోర్ ప్రొసెసర్, 3GB ర్యామ్, 32GB ఇంబిల్ట్ స్టోరేజ్, 128 GB అదనపు స్టోరేజ్ సపోర్ట్. 13MP, 2MP కెమేరాస్, స్క్రీన్ సైజ్ పై ఎటువంటి అప్ డేట్ లేదు. అయితే బ్లాక్ బెర్రీ పాస్ పోర్ట్ మోడల్ స్క్రీన్ సైజ్ 4.5 in డిస్ప్లే ఉండనుంది అని గతంలో న్యూస్ వినిపించేది. దీనికి 3,450 mah బ్యాటరీ ఉండనుంది.
బ్ల్లాక్ బెర్రీ డల్లాస్ మరియు బ్ల్లాక్ బెర్రీ Venice
బ్ల్లాక్ బెర్రీ Venice రూమర్డ్ స్పెక్స్ – evleaks ప్రకారం దీనికి స్లైడ్ ఉంటుంది. క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 808 SoC, 3GB ర్యామ్, 18MP మరియు 5MP కెమేరాస్, లీక్ అయిన ఫోటో ప్రకారం 5.4 in డ్యూయల్ కర్వ్డ్ 1440 x 2560 పిక్సెల్స్ డిస్ప్లే ఉండనుంది. ఇదే స్క్రీన్ సామసంగ్ లేటెస్ట్ సక్సెస్ఫుల్ మోడల్ S6 లో ఉంది. వీటి అన్నిటిలో మేజర్ రూమర్ ఏంటంటే, Venice మోడల్ బ్లాక్ బెర్రీ OS మీద కాకుండా ఆండ్రాయిడ్ పై రన్ అవుతుంది.
బ్లాక్ బెర్రీ డల్లాస్ మోర్ పిక్స్
ఆధారం: Blackberries.ru , Zauba, N4BB