కెనడియన్ స్మార్ట్ ఫోన్ కంపెని, బ్లాక్ బెర్రీ ఆండ్రాయిడ్ ప్లాట్ఫారం పై పని చేసే మోడల్ ను తయారు చేస్తుంది అని Reuters బృందం రిపోర్ట్స్ చెబుతున్నాయి. దీనిలో స్లైడ్ చేయగలిగే ఫిజికల్ క్వర్టీ కీ బోర్డ్ ఉండనుంది అనీ రిపోర్ట్స్. బ్లాక్ బెర్రీ 10 ఆపరేటింగ్ సిస్టం పై కాకుండా ఆండ్రాయిడ్ OS పై రన్ అయ్యే ఇదే మోడల్ ను తాజాగా బార్సెలోనా లో జరిగిన MWC (మొబైల్ వరల్డ్ కాంగ్రెస్) 2015 టెక్ ఈవెంట్ లో బ్లాక్ బెర్రీ షో కేస్ చేయటం జరిగింది. దీనిలోని మరో ప్రత్యేకత కర్వ్ద్ స్క్రీన్.
ఆండ్రాయిడ్ పై బ్లాక్ బెర్రీ పనిచేయటం RIM సంస్థ ఇన్ డైరెక్ట్ గా తన బ్లాక్ బెర్రీ ప్రస్తుత వెర్షన్ OS 10 ఆండ్రాయిడ్ OS కు ఎటువంటి పోటీ ఇవలేకపోతుంది అని స్పష్టంగా తెలుస్తుంది. ప్రస్తుత స్మార్ట్ ఫోన్ మార్కెట్ లో బ్లాక్ బెర్రీ కనీసం 1 శాతం మార్కెట్ షేర్ ను కూడా సొంతం చేసుకోవటం లేదు. తాజాగా BB నుండి విడుదలైన పాస్ పోర్ట్ మోడల్ కూడా అనుకున్నంత మార్కెట్ ను సాధించిలేక పోయింది.
అయితే బ్లాక్ బెర్రీ ఆండ్రాయిడ్ os తో కేవలం ఒక్క మోడల్ ను లాంచ్ చేస్తుందా లేక మరిన్ని మోడల్స్ ను ఇక నుండి బ్లాక్ బెర్రీ సొంత OS పై కాకుండా ఆండ్రాయిడ్ పైనే కొనసాగిస్తుందా అనేది మొదటి మోడల్ సక్సెస్ పై ఆధారపడి ఉంటుంది. ఫస్ట్ మోడల్ సక్సెస్ అవ్వాలి అనుకుంటే కంపెని స్టాండర్డ్స్ తగ్గట్టుగా హై ఎండ్ లో ఫోన్ ధరను ప్రవేశ పెడితే సక్సెస్ అవడం కష్టం. గతాన్ని పక్కన పెట్టి మార్పును ఎంత తొందరగా ఆహ్వానిస్తే అంత తొందరగా సక్సెస్ వస్తుంది అని కంపెనీలు ఎంత తొందరగా తెలుసుకుంటే అంత వేగంగా సక్సెస్ బాట పట్టే అవకాశాలు ఉంటాయి.