బ్లాక్ బెర్రీ మరొక QWERTY స్మార్ట్ ఫోన్ రిలీజ్ చేసింది CES 2017 లో. ఈ స్మార్ట్ ఫోన్ బ్లాక్ బెర్రీ బ్రాండింగ్ కలిగినదే కాని తయారీ మాత్రం TCL కంపెని చేసింది.
గతంలో కంపెని ప్రెసిడెంట్ ట్విటర్ లో కూడా పరిచయం చేశారు ఫోన్ గురించి. అయితే ప్రస్తుతానికి ఇంకా ఈ ఫోన్ మార్కెట్ పేరు తెలియలేదు కానీ కోడ్ నేమ్ మాత్రం Mercury.
దీనిలో ఫిజికల్ కీ బోర్డ్ ఉంటుంది. అందులో స్పేస్ బార్ కుక్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఉంటుంది అని తెలుస్తుంది.ఇంకా అదే కీ బోర్డ్ లో టచ్ పాడ్ కూడా ఇంబిల్ట్ గా పెట్టడం జరిగింది. Mercury లో ఆండ్రాయిడ్ Nougat లేటెస్ట్ OS రన్ అవుతుంది.
కంప్లీట్ స్పెక్స్ తో ఫోన్ ను వచ్చే నెలలో జరగబోయే మొబైల్ వరల్డ్ కాంగ్రెస్(MWC) లో తెలియజేస్తారని అంచనా.
ఇప్పటి వరకూ బ్లాక్ బెర్రీ Priv, DTEK50(మిడ్ రేంజ్ బడ్జెట్ ఫోన్), DTEK60(ఫ్లాగ్ షిప్ మోడల్) ఆండ్రాయిడ్ ఫోన్లను రిలీజ్ చేసింది.