BlackBerry మోషన్ 4000mAh బ్యాటరీ తో లాంచ్.

Updated on 09-Oct-2017

ప్రారంభం లో  Krypton  కాడ్నేమ్  BlackBerry Motion  ని  అధికారికంగా లాంచ్ చేసింది .  ఈ స్మార్ట్ ఫోన్ యొక్క రెండర్స్  గత వారం లో లీక్ అయ్యాయి .  మరియు  దీనిని దుబాయ్ లో  GITEX  టెక్నాలజీ   వీక్ లో షోకేస్ చేశారు . దీని యొక్క ఫీచర్స్ మరియు స్పెక్స్ KEYone  లానే వున్నాయి . 

BlackBerry మోషన్ ఒక మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్ . బ్లాక్బెర్రీ యొక్క హార్డ్వేర్ పార్టనర్ TCL చే నిర్మించబడినది .   మరియు ఈ పరికరానికి KEYONE వంటి ఫిజికల్  క్వర్టీ  కీబోర్డ్ లేదు. ఈ స్మార్ట్ఫోన్ 5.5 అంగుళాల ఫుల్  HD డిస్ప్లేని కలిగి ఉంది మరియు ఈ ఫోన్ క్వాల్కమ్ యొక్క పవర్-ఎఫెక్టివ్ స్నాప్డ్రాగెన్ 625 చిప్సెట్ ని  కలిగి ఉంది. ఈ డివైస్  4GB RAM మరియు 32GB స్టోరేజ్ తో వస్తుంది మరియు దాని స్టోరేజ్ SD కార్డ్ ద్వారా 2TB ద్వారా పెంచబడుతుంది.

బ్లాక్బెర్రీ మోషన్ 12MP ప్రైమరీ  కెమెరాని కలిగి ఉంటుంది, ఇది f / 2.0 ఎపర్చర్, ఫేస్ డిసెక్షన్ ఆటోఫోకస్ మరియు డ్యూయల్ టోన్ LED ఫ్లాష్ తో వస్తుంది. దీని ప్రధాన కెమెరా HDR కి సపోర్ట్ చేస్తుంది .  మరియు సెకనుకు 30 ఫ్రేముల వద్ద 4K వీడియో రికార్డు చేయగలదు. దీని ముందు ఒక 8MP సెల్ఫీ కెమెరాతో ప్రత్యేకమైన ఫ్లాష్ వస్తుంది మరియు 1080p వీడియో రికార్డింగ్ కు  సపోర్ట్  ఇస్తుంది.

BlackBerry మోషన్ DTEK సెక్యూరిటీ సూట్ తో  ఆండ్రాయిడ్  7.1.1  నౌగాట్ ఫై నడుస్తుంది, ఇది 140-2 ఫుల్  డిస్క్ ఎన్క్రిప్షన్ను అందిస్తుంది మరియు పని కోసం ఆండ్రాయిడ్  మరియు Google Play కి సపోర్ట్  ఇస్తుంది. ఈ డివైస్  WiFi 802.11ac, బ్లూటూత్ 4.2 LE, NFC, GPS మరియు 4G LTE కనెక్టివిటీకిఆప్షన్స్ . బ్లాక్బెర్రీ మోషన్  4000mAh బ్యాటరీని కలిగి ఉంది.

Connect On :