BlackBerry KEYone స్మార్ట్ ఫోన్ ఈరోజు భారత్ లో లాంచ్ అవుతుంది . దీని కోసం కంపెనీ ఒక ఈవెంట్ ను కూడా కండెక్ట్ చేస్తుంది . దీనికోసం మీడియా ని కూడా పిలిచింది . అయితే పక్కాగా ఈ ఫోన్ లాంచ్ చేస్తారని సమాచారం లేదు కానీ ఈ ఫోన్ లాంచ్ అవుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు .
BlackBerry KEYone లోని ఫీచర్స్ చూస్తే 4.5- ఇంచెస్ డిస్ప్లే అండ్ రిజల్యూషన్ 1620 x 1080 పిక్సల్స్ . దీనిలో ఒక QWERTY కీ బోర్డు కలదు . దీని లో LCD ప్యానెల్ గొరిల్లా గ్లాస్ 4ఇవ్వబడింది . ఇది ఒక ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ . దీనిలో 12MP Sony IMX378 సెన్సార్ రేర్ కెమెరా , ఫ్రంట్ సైడ్ 8MP కెమెరా ఇవ్వబడింది .
దీనిలో ఆక్టా కోర్ స్నాప్ డ్రాగన్ 625 ప్రోసెసర్ ఇవ్వబడింది. ఇది ఆండ్రాయిడ్ 7.1 ఆపరేటింగ్ సిస్టం పై పని చేస్తుంది . దీనిలో 3GB RAM అండ్ 3505mAh బ్యాటరీ గలదు . ఫోన్ లో 32GB ఇంటర్నల్ స్టోరేజ్ గలదు . దీనిలో కనెక్టివిటీ కోసం USB టైప్ -C పోర్ట్ , బ్లూటూత్ , వైఫై అండ్ 4G LTE సపోర్ట్ కలదు .
మరిన్ని మంచి డీల్స్ చూడటానికి ఇక్కడ క్లిక్ చేయండి