బ్లాక్ బెర్రీ ఎవాల్వ్ మరియు ఎవాల్వ్ ఎక్స్ ఫుల్ – టచ్ ఆండ్రాయిడ్ ఫోన్లు రూ . 24,990 మరియు రూ . 34,990 ధరలతో ఇండియాలో విడుదల అయ్యాయి

Updated on 06-Aug-2018
HIGHLIGHTS

బ్లాక్ బెర్రీ "మేక్ ఇన్ ఇండియా" అనే నినాదం తో ముండదడుగు వేసింది, బ్లాక్ బెర్రీ ఎవాల్వ్ మరియు ఎవాల్వ్ ఎక్స్ స్మార్ట్ ఫోన్లను నోయిడాలో ఉన్నటువంటి ఆప్టిమస్ ఇన్ఫ్రాకోమ్ యొక్క సౌకర్యంతో రూపొందించడంతో పాటు తయారీ కూడా చేయబడ్డాయి కూడా. రెండు ఫోన్లు కూడా అమెజాన్ ఎక్స్క్లూజివ్ గా రానున్నాయి.

ఇండియాలో బ్లాక్ బెర్రీ యొక్క తయారీ మరియు అమ్మక హక్కులను కలిగివున్న ఆప్టిమస్ ఇంఫ్రాకామ్ లిమిటెడ్ కంపెనీ కొత్తగా బ్లాక్ బెర్రీ ఎవాల్వ్ మరియు ఎవాల్వ్ స్మార్ట్ ఫోన్లను వరుసగా రూ . 24,990 మరియు  రూ . 34,990 ధరలతో ఇండియాలో విడుదలచేసింది. ఈ ఎవాల్వ్ సిరీస్ ఫోన్ లు ఆండ్రాయిడ్ యొక్క శక్తి మరియు బ్లాక్ బెర్రీ యొక్క సెక్యూరిటీతో కూడిన కలయికగా అందనున్నాయి. భారత ప్రభుత్వానికి ఇచ్చిన కమిట్మెంట్ ప్రకారం ప్రభుత్వం యొక్క "మేక్ ఇన్ ఇండియా " చొరవతో ,ఇండియా లోని నోయిడాలో వున్న ఆప్టిమస్ ఇన్ఫ్రాకోమ్ యొక్క  సౌకర్యంతో రూపొందించడంతో పాటు తయారీ కూడా చేయబడ్డాయి. ఈ రెండు స్మార్ట్ ఫోన్లు కూడా 18:9 యాస్పెక్ట్ రేషియో తో కూడిన ఫుల్-వ్యూ డిస్ప్లే, డాల్బీ సరౌండ్ సౌండ్ ,డ్యూయల్-కెమేరా మరియు క్విక్ ఛార్జింగ్ పరిజ్ఞానం తో అందించబడ్డాయి.

దీనిలో ఇంకా అదనంగా,  ఎవాల్వ్ మరియు ఎవాల్వ్ ఎక్స్ ఫేసియల్ రికగ్నైజేషన్ తో పాటు భద్రతతో కూడిన త్వరగా స్పందించే ఫింగర్ ప్రింట్ సెన్సార్లాంటి వాటిని కూడా కలిగివుంది. బ్లాక్ బెర్రీ అప్లికేషన్ ద్వారా DTEK కోసం మద్దతుతో సహా పరికరాల యొక్క అప్లికేషన్ లేయర్ వరకు కెర్నెల్ స్థాయి నుండి అదనపు చర్యలను ఉపయోగించి, దాని భద్రతా అమలుకు బ్లాక్ బెర్రీ సంస్థ-గ్రేడ్ భద్రత మరియు గోప్యతను కలిగి ఉంది.

" నేడు బ్లాక్ బెర్రీ సంస్థ యొక్క వస్తువులను సురక్షితం చేసే సాఫ్ట్వేర్ కంపెనీ. స్థానిక భాగస్వామి మరియు అధికారపూరిత అనుమతితో సురక్షితమైన ఆండ్రాయిడ్ బ్లాక్ బెర్రీ స్మార్ట్ ఫోన్ల తయారీ మరియు తయారీకి సంభందించిన మా వ్యూహంలతో  మా భాగస్వామి అయిన ఆప్టియస్ ఇన్ఫ్రాకోమ్ ప్రస్తుత తాజా ప్రయోగంతో ఊపందుకుంది.  భారతదేశంలోని వినియోగదారులకి తెలుసు, ప్రేమతో రూపొందించి మరియు నిర్మించిన విశ్వసనీయ మరియు సురక్షితమైన బ్లాక్ బెర్రీ అనుభవాన్ని అందించడానికి మా భాగస్వామ్యాన్నిభారతదేశంలో మరింత విస్తరించడానికి మేము సంతోషిస్తున్నాము "అని బ్లాక్ బెర్రీ మొబిలిటీ సొల్యూషన్స్ యొక్క ఎస్.వి.పి మరియు GM అయిన అలెక్స్ థర్బర్ తెలిపారు.

ఈ రెండు డివైజ్లను బ్లాక్ బెర్రీ హబ్ తో లోడ్ చేస్తారు – ఫేస్బుక్, ట్విట్టర్, లింక్డ్ఇన్, బిబిఎమ్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ మరియు ఇతర సేవలతో సహా సోషల్ మీడియా ఖాతాల నుండి ఇమెయిల్స్, టెక్ట్స్ మరియు సందేశాలు మెసేజ్ ఇన్ బాక్స్ లో అందుతాయి.

ఆగష్టు చివరలో అమెజాన్.ఇన్ లో బ్లాక్బెర్రీ ఎవాల్వ్ ఎక్స్ ఎక్స్క్లూజివ్ గా  అందుబాటులో ఉంటుంది మరియు బ్లాక్ బెర్రీ ఎవాల్వ్ సెప్టెంబర్ మధ్యలో అందుబాటులో ఉంటుంది. ఈ ఫోన్లు EMI లావాదేవీలతో పాటు రూ. 3,950 ల  రిలయన్స్ జీయో క్యాష్ బ్యాక్ ఆఫర్ మరియు ఐసీఐసీఐ బ్యాంకు క్రెడిట్ కార్డు నుంచి ఐదు శాతం తక్షణ క్యాష్ బ్యాక్ ఆఫర్లలాంటి అదనపు ప్రయోజనాలతో విడుదల కానున్నాయి. 

   

బ్లాక్ బెర్రీ ఎవాల్వ్ ఎక్స్ స్పెసిఫికేషన్స్ మరియు ఫీచర్లు

బ్లాక్ బెర్రీ ఎవాల్వ్ ఎక్స్, 18: 9 యాస్పెక్ట్ రేషియాతో కూడిన 1080 x 2160 రిజల్యూషన్ కలిగిన ఒక 5.99 – అంగుళాల ఐపిఏస్ ఎల్సిడి  డిస్ప్లేని కలిగి ఉంది. ఈ డిస్ప్లే 2.5 D కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ద్వారా రక్షించబడింది. ఇంకా ఇక్కడ   మృదువైన టచ్ బ్యాక్ ప్యానెల్ మన్నిక కోసం, గ్రేడ్ 7 అల్యూమినియం ఫ్రేమ్ తో అనుసంధానించారు. ఫింగర్ ప్రింట్ సెన్సార్ ని కెమెరా మరియు బ్లాక్ బెర్రీ యొక్క బ్రాండిగ్ కి మధ్యన  ఉంచారు. క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 660 64-బిట్ ఆక్టా – కోర్ ప్రాసెసర్ (నాలుగు కోర్ల 1.8 గిగాహెడ్జ్ వద్ద క్లాక్ చేయగా, మిగిలినవి 2.2 గిగాహెడ్జ్ వద్ద క్లాక్ చేయబడ్డాయి), ఫోన్ కేవలం ఒక వేరియంట్ లో మాత్రమే అందిస్తున్నారు, అది 6జీబీ ర్యామ్ + 64జీబీ స్టోరేజ్,ఇంకా దీనిని  2టీబీ వరకు విస్తరించవచ్చు . ఇది ఆండ్రాయిడ్ 8.1 Oreo OS తో పనిచేస్తుంది. బ్లాక్ బెర్రీ ఎవాల్వ్ ఎక్స్ లో రిచ్ 3D సరౌండ్ సౌండ్ అందించేందుకు వీలుగా డాల్బీ ఎట్మోస్(dolby atmos) అమర్చారు. బ్లాక్ బెర్రీ ఎవాల్వ్ ఎక్స్ లో ఆడియో టెక్నాలజీ అనేది ఒక స్పష్టమైన డైలాగ్ ,  ధ్వని ఖాళీలను బందించి, ఎక్కువ సూక్ష్మభేదం మరియు స్వల్పభేదాన్ని, వక్రీకరణ లేకుండా గరిష్ట స్థాయిని మరియు అన్ని కంటెంట్ రకాలలో స్థిరమైన ప్లేబ్యాక్ వాల్యూమ్ ని అందించడానికి ఎయిమ్ చేస్తుంది. వాస్తవానికి, మేము పరికరాన్ని సమీక్షించినప్పుడు ఇది అన్నింటినీ పరీక్షించాము.

ఆప్టిక్స్ విభాగంలో, స్మార్ట్ ఫోన్ డ్యూయల్ టోన్ LED ఫ్లాష్ తో కూడిన డ్యూయల్  కెమేరా సెటప్ కలిగి ఉంది. ప్రాధమిక కెమెరాకి f/1.8 తో కూడైన  12ఎంపీ లెన్స్ ఉంది మరియు f/2.6 ఎపర్చరుతో కూడిన 13ఎంపీ కెమెరా ద్వితీయ వస్తుంది.  బ్లాక్ బెర్రీ ఎవాల్వ్ ఎక్స్, f/2.0 ఎపర్చరుతో 16ఎంపీ కి స్పోర్ట్ చేస్తుంది ముందు కెమేరా. భారీ 4000 mAh బ్యాటరీ మరియు క్వాల్కమ్ స్పీడ్ ఛార్జ్ 3.0 టెక్నాలజీ కలిగివున్న బెర్రీ ఎవాల్వ్ ఎక్స్ వైర్లెస్ ఛార్జింగ్ తో వస్తుంది మరియు "బ్యాటరీని కొన్ని నిమిషాల పాటు ఛార్జ్ చేయడంతోనే కొన్ని గంటల పాటు వాడుకునే వీలుంటుందని" అని కంపెనీ వివరిస్తుంది.

 

బ్లాక్ బెర్రీ ఎవాల్వ్ స్పెసిఫికేషన్స్ మరియు ఫీచర్లు

బ్లాక్ బెర్రీ ఎవాల్వ్ ఎక్స్ లాగానే, బ్లాక్ బెర్రీ ఎవాల్వ్ కూడా 18: 9 యాస్పెక్ట్ రేషియాతో కూడిన ఒక 5.99 – అంగుళాల ఐపిఏస్ ఎల్సిడి  డిస్ప్లేని కలిగి ఉంది.ఈ స్మార్ట్ ఫోన్  క్వాల్కమ్ స్నాప్డ్ డ్రాగన్ 450 ఆక్టా – కోర్ 64-బిట్ ప్రాసెసర్ 1.8 గిగా హెడ్జ్ తో క్లాక్ చేయబదినది. ఈ ఎవాల్వ్ ఫోన్  ఆండ్రాయిడ్ 8.1 Oreo OS తో పనిచేస్తుంది. ఇది 4జీబీ  ర్యామ్ + 64జీబీ స్తొరజి వేరియంట్లో వస్తుంది, ఇంకా  దీనిలో మెమరీ 256జీబీ  వరకు విస్తరించగలిగే అవకాశం ఉంది. ఇది పేస్ అన్లాక్ ఫీచర్ కి మద్దతు ఇవ్వడంమే కాకుండా  ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో వస్తుంది. ఆప్టిక్స్ పరంగా,వెనుక వైపు  రెండు 13ఎంపీ + 13ఎంపీ  కెమెరాలతో డ్యూయల్ టోన్ LED ఫ్లాష్  తయారుచేయండి. వెనుక కెమెరా 2K నాణ్యతలో వీడియోలను రికార్డు చేయగలదు. ముందు, 16ఎంపీ వెడల్పు గల కెమెరా టెట్రాసెల్ సాంకేతిక పరిజ్ఞానంతో ఉంది, ఇది  కాంతి తక్కువగా వున్నపుడు వాటిని కాంతివంతంగా మరియు  మరింత వివరణాత్మకంగా  అక్కడి పర్యవరణానికి  అనుగుణంగా చిత్రించడానికి సహకరిస్తుంది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :