వివో లేటెస్ట్ కర్వ్డ్ ఫోన్ Vivo V29e 5G పైన భారీ తగ్గింపు.!

Updated on 06-Mar-2024
HIGHLIGHTS

వివో వి 29e స్మార్ట్ ఫోన్ పైన కంపెనీ తగ్గింపు ప్రకటించింది

వివో లేటెస్ట్ కర్వ్డ్ ఫోన్ మరింత సరసమైన ధరకే లభిస్తుంది

ఈ వివో ఫోన్ 5000 mAh బ్యాటరీని 44W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కలిగి వుంది

వివో లేటెస్ట్ కర్వ్డ్ ఫోన్ Vivo V29e 5G పైన భారీ తగ్గింపు ప్రకటించింది కంపెనీ. అందమైన డిజైన్ మరియు కలర్ ఆప్షన్ లతో పాటుగా ఆకర్షణీయమైన ఫీచర్స్ తో వచ్చిన వివో వి 29e స్మార్ట్ ఫోన్ పైన కంపెనీ తగ్గింపు ప్రకటించింది. ఇండియాలో విడుదలైన నటి నుండి మంచి అమ్మకాలను సాధించిన ఈ వివో కర్వ్డ్ 5జి స్మార్ట్ ఫోన్, ఇప్పుడు మరింత సరసమైన ధరకే లభిస్తుంది.

Vivo V29e 5G: Price Cut

వివో వి 29e స్మార్ట్ ఫోన్ ముందుగా రూ. 26,999 ప్రారంభ ధరతో మార్కెట్ లో విడుదల చెయ్యబడింది. అయితే, ఈ ఫోన్ ఇప్పుడు బీభరి తగ్గింపును అందుకొని కేవలం రూ. 25,999 రూపాయల ప్రారంభ ధరకే లభిస్తోంది. ఈ స్మార్ట్ ఫోన్ ను ఇప్పుడు సరసమైన ధరకే కంపెనీ ఆఫర్ చేస్తోంది.

అయితే, ఈ ఫోన్ ను అమేజాన్ ఇండియా నుండి రూ. 24,999 రూపాయల డిస్కౌంట్ ధరకే ఆఫర్ చేస్తోంది మరియు మంచి బ్యాంక్ ఆఫర్ ను కూడా అమేజాన్ జత చేసింది. Buy From Here

Also Read: Realme 12+ 5G ఈ Top-5 ఫీచర్స్ తో వచ్చింది.. రేటు ఎంతంటే.!

Vivo V29e 5G: ప్రత్యేకతలు

వివో వి 29e 5G స్మార్ట్ ఫోన్ డైమండ్ కట్ క్రిస్టల్స్ సిమ్మరింగ్ 3D Curved AMOLED డిజైన్ తో ఆకట్టుకుంటుంది. ఈ ఫోన్ లో 120Hz రిఫ్రెష్ రేట్ కలిగిన 6.78 ఇంచ్ 3D Curved డిస్ప్లేని కలిగి వుంది. ఈ ఫోన్ Snapdragon 695 ఆక్టా కోర్ 5G ప్రోసెసర్ తో వస్తుంది మరియు Funtouch OS 13 పైన నడుస్తుంది.

Vivo V29e 5G Features

ఈ వివో 5జి కర్వ్డ్ స్మార్ట్ ఫోన్ లో 64 MP OIS మెయిన్ సెన్సార్ + 8 MP అల్ట్రా వైడ్ సెన్సార్ కలిగిన డ్యూయల్ రియర్ కెమేరా సెటప్ వుంది. ఈ మెయిన్ కెమేరాతో 4K వీడియోలను షూట్ చేయవచ్చు. అలాగే , ఈ ఫోన్ లో ముందు ఆటో ఐ ఫోకస్ 50MP సెల్ఫీ కెమేరా కొద వుంది. ఈ వివో ఫోన్ 5000 mAh బ్యాటరీని 44W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కలిగి వుంది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :