Price Drop: iQOO లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ పైన రూ.5,000 భారీ తగ్గింపు.!

Updated on 10-Apr-2023
HIGHLIGHTS

iQOO లేటెస్ట్ బెస్ట్ 5G స్మార్ట్ ఫోన్ iQOO Neo 6 5G పైన భారీ తగ్గింపును ప్రకటించింది

iQOO Quest Days సేల్ నుండి ఈ స్మార్ట్ ఫోన్ రూ.5,000 రూపాయల భారీ డిస్కౌంట్ తో లభిస్తోంది

ఈ ప్రైస్ రేంజ్ లో HDR10+ సర్టిఫైడ్ 120Hz రిఫ్రెష్ రేట్ E4 AMOLED డిస్ప్లే కలిగిన ఫోన్ గా నిలుస్తుంది

iQOO లేటెస్ట్ బెస్ట్ 5G స్మార్ట్ ఫోన్ iQOO Neo 6 5G పైన భారీ తగ్గింపును ప్రకటించింది. అమెజాన్ ప్లాట్ఫామ్ పైన నిన్నటి నుండి మొదలైన iQOO Quest Days సేల్ నుండి ఈ స్మార్ట్ ఫోన్ రూ.5,000 రూపాయల భారీ డిస్కౌంట్ తో లభిస్తోంది. ఈ స్మార్ట్ ఫోన్ ఈ తగ్గింపు  తరువాత, ఈ ప్రైస్ రేంజ్ లో HDR10+ సర్టిఫైడ్ 120Hz రిఫ్రెష్ రేట్ E4 AMOLED డిస్ప్లే కలిగిన ఫోన్ గా నిలుస్తుంది. అమెజాన్ నుండి భారీ తగ్గింపుతో లభిస్తున్న ఈ బెస్ట్ డీల్ అఫర్ ధర మరియు స్పెక్స్ తెలుసుకోండి.    

iQOO Neo 6 5G: ధర మరియు ఆఫర్లు

ఐకూ నియో 6 5జి స్మార్ట్ ఫోన్ యొక్క 8GB+128GB వేరియంట్ ధర రూ.29,999 ధరతో వచ్చింది. అయితే, ఈ స్మార్ట్ ఫోన్ ఇప్పుడు 5,000 రూపాయల భారీ తగ్గింపుతో రూ.24,999 అఫర్ ధరతో సేల్ అవుతోంది. అలాగే, 12GB+256GB హై ఎండ్ వేరియంట్ ధర రూ.28,999. Buy From Here    

iQOO Neo 6 5G: స్పెక్స్

ఐకూ నియో 6 5జి స్మార్ట్ ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్ మరియు 1200Hz ఇన్స్టాంట్ టచ్ శాంప్లింగ్ రేట్ కలిగిన 6.62 ఇంచ్ పరిమాణం కలిగిన FHD+ రిజల్యూషన్ E4 AMOLED డిస్ప్లే ని కలిగి వుంది.ఈ డిస్ప్లే 1300 పీక్ బ్రైట్నెస్ అందించ గలదు మరియు HDR 10+ సపోర్ట్ తో వస్తుంది. ఈ ఫోన్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 870 5G ప్రొసెసర్ తో పనిచేస్తుంది. దీనికి జతగా గరిష్టంగా 12GB ర్యామ్ మరియు 256GB ఇంటర్నల్ స్టోరేజ్ సపోర్ట్ తో వస్తుంది అలాగే, ఫోన్ ను నిరంతరం చల్లగా ఉంచడానికి 36907 mm² క్యాస్ కేడ్ కూలింగ్ సిస్టం ను కూడా కలిగి ఉంటుంది.

ఆప్టిక్స్ విభాగంలో, ఈ లేటెస్ట్ ఐ కూ 5G ఫోన్ వెనుక ట్రిపుల్ కెమెరా సెటప్పు ఉంది. ఈ ట్రిపుల్ కెమెరాలో 64MP OIS ప్రధాన కెమెరాకి జతగా 8MP అల్ట్రా వైడ్ కెమెరా మరియు 2MP మ్యాక్రో సెన్సార్ తో వస్తుంది. ముందుభాగంలో, 16MP సెల్ఫీ కెమెరాని సెల్ఫీల కోసం అందించింది. ఈ 5G స్మార్ట్ ఫోన్ లో 4,700mAh బ్యాటరీని 80W ఫ్లాష్ ఛార్జ్ సపోర్ట్ తో అందించింది. మొబైల్ గేమర్‌ లను ఆకర్షించడానికి, ఈ ఫోన్ లో 4D గేమ్ వైబ్రేషన్ ని లీనియర్ వైబ్రేషన్ మోటార్ తో జతచేసింది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :