digit zero1 awards

యాపిల్ డేస్ సేల్ నుండి Apple iPhone 13 పై భారీ డిస్కౌంట్ అందించిన అమెజాన్.!

యాపిల్ డేస్ సేల్ నుండి Apple iPhone 13 పై భారీ డిస్కౌంట్ అందించిన అమెజాన్.!
HIGHLIGHTS

యాపిల్ డేస్ సేల్ నుంచి Apple iPhone 13 పై భారీ డిస్కౌంట్

అమెజాన్ అందించిన ఈ సేల్ నుంచి మంచి డీల్ ను అందుకోవచ్చు

No Cost EMI మరియు అదనపు ఎక్స్ చేంజ్ బోనస్ ను కూడా అందిస్తోంది

అమెజాన్ ఇండియా సరికొత్తగా ప్రకటించిన యాపిల్ డేస్ సేల్ నుంచి Apple iPhone 13 పై భారీ డిస్కౌంట్ ప్రకటించింది. యాపిల్ ఫోన్ కావాలని చాలా కాలంగా ఎదురు చూస్తున్న వారు ఈరోజు అమెజాన్ అందించిన ఈ సేల్ నుంచి మంచి డీల్ ను అందుకోవచ్చు. అమెజాన్ అందించిన ఈ సేల్ మరియు డీల్ పై ఒక లుక్కేద్దాం పదండి.

యాపిల్ డేస్ సేల్ డీల్

అమెజాన్ ప్రకటించిన యాపిల్ డేస్ సేల్ నుంచి యాపిల్ ఐఫోన్ 13 ను భారీ డిస్కౌంట్ తో రూ. 48,799 రూపాయల ఆఫర్ ధరకే అందిస్తోంది. ఈ ఫోన్ పైన No Cost EMI మరియు అదనపు ఎక్స్ చేంజ్ బోనస్ ను కూడా అందిస్తోంది. ఐఫోన్ యొక్క 128GB స్టోరేజ్ తో వచ్చే బేసిక్ వేరియంట్ ను ఈ డిస్కౌంట్ ధరకు ఆఫర్ చేస్తోంది. Buy From Here

Also Read: OnePlus Nord CE4 Lite: వన్ ప్లస్ సరసమైన ఫోన్ వచ్చేసింది.. ధర ఎంతంటే.!

Apple iPhone 13: ఫీచర్లు

యాపిల్ ఐఫోన్ 13 ఫోన్ ను సూపర్ రెటీనా XDR డిస్ప్లేతో వస్తుంది. ఈ ఫోన్ అల్యూమినియం ఎడ్జెస్ మరియు సిరామిక్ షీల్డ్ తో చాలా గట్టిగా ఉంటుంది. ఈ ఐఫోన్ 12MP అల్ట్రా వైడ్ మరియు 12MP వైడ్ డ్యూయల్ రియర్ కెమెరాతో వస్తుంది. ఈ ఇది అడ్వాన్డ్ కెమెరా ఫీచర్లు మరియు 4K Dolby Vision HDR సపోర్ట్ ను కలిగి ఉంటుంది. అలాగే, 4K Dolby Vision HDR వీడియో రికార్డ్ సపోర్ట్ కలిగిన 12MP ట్రూ డెప్త్ సెల్ఫీ కెమెరా కూడా ఈ ఫోన్ లో వుంది.

Apple iPhone 13 Features
Apple iPhone 13 Features

యాపిల్ ఐఫోన్ 13 ఫోన్ యాపిల్ A15 Bionic చిప్ సెట్ తో పని చేస్తుంది. ఇది కొత్త 6 కోర్ CPU మరియు వేగవంతమైన పెర్ఫార్మెన్స్ అందిస్తుంది. ఈ ఫోన్ లో ఎక్కువ సమయం నిలిచి ఉండే లాంగ్ లైఫ్ బ్యాటరీ కూడా వుంది. ఈ ఫోన్ ఆఫర్ గురించి సింపుల్ గా చెప్పాలంటే, అమెజాన్ ప్రకటించిన సేల్ నుండి ఐఫోన్ 13 ఫోన్ ను ఎన్నడూ చూడనంత తక్కువ ధరకే అందుకునే అవకాశం వుంది. అలాగే, ఈ ఫోన్ పైన అందించిన బ్యాంక్ ఆఫర్ తో మరింత లాభాలను కూడా అందుకోవచ్చు.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo